ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @5pm - top ten news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @5pm
టాప్​టెన్ న్యూస్ @5pm
author img

By

Published : Oct 26, 2020, 5:00 PM IST

1. భాగమవుతారా..?

భారత్​ బయోటెక్​ అభివృద్ధి చేసిన 'కోవాగ్జిన్‌’ టీకా మూడో దశ మానవ ప్రయోగాలకు సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ అనుమతి లభించింది. ఇందుకు సంబంధించిన ప్రయోగాలను ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేపట్టనున్నారు. అయితే వీటిలో వలంటీర్లుగా పాల్గొనాలనుకునే వారి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. యూపీ నుంచి గరికపాటి..!

ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే వారిలో తెలుగు వ్యక్తి కూడా ఉండబోతున్నారు. మాజీ ఎంపీ గరికపాటి మోహనరావు పేరు ఈ జాబితాలో ఉండనున్నట్లు సమాచారం. తెలంగాణ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభ సీటు దక్కించుకున్న గరికపాటి.. అనంతరం భాజపాలో చేరారు. నాటి హామీ మేరకు కమలం పార్టీ అగ్రనాయకత్వం యూపీ నుంచి రాజ్యసభకు గరికపాటి పేరుక ఖరారు చేసినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3.ఎన్నికల సోదాలు..

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నికలో భాజపా తరపున పోటీ చేస్తున్న రఘునందర్‌రావు బంధువు ఇంట్లో పోలీసులు, రెవెన్యూ అధికారులు సోదాలు చేశారు. ఆ తనిఖీల్లో రూ. 18.67 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. డ్యాం నిర్మాణానికే ఇస్తాం..

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. సమాచార హక్కు చట్టం కింద దాఖలు చేసిన అర్జీకి సమాధానమిస్తూ వివరాలు తెలిపింది. ఆర్టీఐ ద్వారా ప్రాజెక్టు నిర్మాణం, పునరావాసం, పరిహారానికి సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. కమిటీ రద్దు

దేశ రాజధాని దిల్లీలో కాలుష్యానికి కారణమవుతున్న పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం నివారణ చర్యలను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీని నిలిపివేసింది సుప్రీంకోర్టు. కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం సమగ్ర చట్టం చేయనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ధర్మాసనం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. నో ఓబీసీ కోటా..

సుప్రీంకోర్టులో తమిళనాడుకు చుక్కెదురైంది. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని వైద్య కళాశాలల్లో నీట్‌ ద్వారా భర్తీచేసే అఖిల భారత కోటా సీట్లలో ఈ ఏడాది 50శాతం ఓబీసీలకు కేటాయించాలన్న తమిళనాడు ప్రభుత్వ అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. ఎఫ్‌బీ ప్రత్యేక వ్యవస్థ

అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో వైరల్ కంటెంట్​ను నియంత్రించేందుకు ఫేస్​బుక్ కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సమాచార విశ్వసనీయతను తెలుసుకునేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఓ ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. తుఫాన్ బీభత్సం

ఫిలిప్పీన్స్​లో మొలావే తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను ధాటికి 13మంది గల్లంతయ్యారు. దాదాపు 25వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. మరో 20వేల మందిని విద్యాలయాల్లో , ప్రభుత్వ భవనాల్లోని పునరావాస కేంద్రాలకు తరలించామని రక్షణ అధికారి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. భారీ నష్టాల్లో..

అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలతో.. దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 540 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 163 పాయింట్లు తగ్గి.. 11,700 మార్క్​ దిగువకు చేరింది. లోహ, వాహన రంగ షేర్లు ప్రధానంగా నష్టాల్లో ముగిశాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. పెళ్లి తర్వాత తొలి దసరా..

పెళ్లి జరిగిన తన తొలి దసరా వేడుకల్ని అత్త వారింట్లో జరుపుకున్నారు హీరో రానా. ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.