ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్ @3PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @3PM
టాప్‌టెన్‌ న్యూస్ @3PM
author img

By

Published : Nov 15, 2020, 3:00 PM IST

1. సీఎం సమీక్ష

రిజిస్ట్రేషన్లు సంబంధిత అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారు. సీఎస్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై చర్చిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. టపాసులకు వెళ్లి అదృశ్యం..

సూర్యాపేటలో ఐదేళ్ల బాలుడి అదృశ్యం కలకలం రేపుతోంది. టపాసుల కోసం దుకాణానికి వెళ్లిన చిన్నారి ఇంటికి తిరిగిరాలేదు. పరిసర ప్రాంతాల్లో గాలించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల కలకలం సృష్టించిన దీక్షిత్ రెడ్డి అపహరణ, హత్యతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కిడ్నాప్ కేసు నమోదు చేసుకొని... గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. నితీష్ ఏకగ్రీవం..

బిహార్ ఎన్డీఏ కూటమి శాసనసభాపక్షనేతగా నితీశ్ కుమార్ ఎన్నికయ్యారు. నితీశ్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్డీఏ పక్షాలు ఆయనను కూటమి నాయకుడిగా ఎన్నుకున్నాయి.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. ముందుంది గడ్డుకాలం

వచ్చే ఏడాది మరింత కఠిన పరిస్థితులు ఎదురవుతాయని ప్రపంచ ఆహార కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డేవిడ్ బీస్లే హెచ్చరించారు. తమ సంస్థకు నోబెల్ రావడం వల్ల ఈ విషయంపై ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసే అవకాశం లభించిందన్నారు. భారీగా నిధులు లేకపోతే తీవ్ర స్థాయి క్షామం ఏర్పడుతుందని, ఆదుకునేందుకు బిలియనీర్లు ముందుకురావాలని అభ్యర్థించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. కసాయి కొడుకు..

మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటన కర్ణాటకలో జరిగింది. కన్న తల్లినే హత్యాచారం చేశాడు ఓ కర్కశ కొడుకు. ఈ నెల 12 జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. 10 మంది మృతి..

వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 10 మంది మరణించారు. బిహార్​లో బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఉత్తర్​ప్రదేశ్​లో కారు అదుపుతప్పి ట్రక్కును ఢీకొన్న ఘటనలో మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. ఐదో అంతస్తులో..

ఏ హోటల్​లో అయినా సిబ్బందికి తప్ప సామాన్య ప్రజలకు అనుమతి లేని కొన్ని గదులుంటాయి. అంతే గానీ పూర్తిగా అంతస్తులోకే అనుమతి లేకుండా ఉండవు. కానీ ఉత్తర కొరియాలోని ఓ హోటల్​లోని ఐదో అంతస్తులోకి ఎవరినీ అనుమతించరు. దీనిని అక్కడి ప్రభుత్వం ఎంతో రహస్యంగా ఉంచుతోంది. అంతలా అందులో ఏముంది? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. రిలయన్స్ చేతికి అర్బన్ ల్యాడర్..

ఓ వైపు వరుసగా పెట్టుబడులను రాబడుతూనే.. మరోవైపు వేగంగా విస్తరణకు అడుగులేస్తోంది రిలయన్స్ రిటైల్ వెంచర్‌ లిమిటెడ్‌. తాజాగా ఈ సంస్థ అర్బన్‌ ల్యాడర్‌ హోమ్‌ డెకార్స్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ను కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ.182.12 కోట్లు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. ఐపీఎల్‌ ఖర్చెంతంటే..

ఐపీఎల్​-2020 ఆతిథ్యం కోసం ఎమిరేట్స్​ క్రికెట్​ బోర్డుకు బీసీసీఐ రూ.100కోట్లపైనే చెల్లించిందని తెలిసింది. ఈ విషయాన్ని ఓ ప్రముఖ వార్త సంస్థ స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. అనుపమ అర్థం

అందాల ముద్దుగుమ్మగా యువత మనసు కొల్లగొట్టేసిన నటి అనుపమ పరమేశ్వరన్​. అలాంటి అమ్మడు మాత్రం అందమంటే మనసు ప్రశాంతంగా ఉండటం అని చెప్పింది​. ప్రస్తుతం హీరో నిఖిల్​ సరసన '18పేజీస్'​ సినిమాలో నటిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.