ETV Bharat / city

TOP NEWS TODAY : టాప్​టెన్​ న్యూస్​ @11AM - తెలుగు వార్తలు

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

TOP NEWS TODAY, telangana news
తెలంగాణ వార్తలు
author img

By

Published : Feb 6, 2022, 10:58 AM IST

సినీ సంగీత ప్రపంచంలో ఎన్నో మధుర గీతాలకు ప్రాణం పోశారు ప్రముఖ గాయని లతా మంగేష్కర్. ఈమెతో పాట పాడించడాన్ని భారతీయ సంగీత దర్శకులు గౌరవంగా భావించేవారు.

  • లతా మంగేష్కర్.. నటిగా ఎంట్రీ, స్టార్ సింగర్​గా చరిత్ర!

ప్రముఖ గాయని లతా మంగేష్కర్​.. అనారోగ్య సమస్యతో ముంబయిలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. నటిగా కెరీర్​ మొదలుపెట్టి.. భారతదేశం గర్వించదగ్గ సింగర్​గా​ ఎలా ఎదిగారో చెప్పేదే ఈ ప్రత్యేక కథనం.

  • దేశంలో తగ్గిన కొవిడ్​ కేసులు

భారత్​లో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 1,07,474 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. ఒక్కరోజులోనే 865 మంది మరణించారు. దేశంలో పాజిటివిటీ రేటు 7.42 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

  • హమారా భారత్‌ బయోటెక్‌ మహాన్‌..

ఓ సైంటిస్టు ల్యాబ్‌లో చేసే పరిశోధన... సై-ఫై థ్రిల్లర్‌లా అనిపిస్తుందా! పరీక్షనాళికల నడుమ చేసే ప్రయోగాలూ... పట్టువీడకుండా చదివిస్తాయా! మామూలు పరిస్థితుల్లో సాధ్యంకాదేమో కానీ... ఆ కథలోని విలన్‌ ప్రపంచాన్ని గడగడలాడించే వైరస్‌ అయినప్పుడు... సాధారణ సంఘటనలు కూడా ఓ అద్భుత కథలా అనిపిస్తాయి. ‘పద్మభూషణ్‌’ కృష్ణమూర్తి- సుచిత్ర ఎల్ల దంపతులు కొవాగ్జిన్‌ కోసం చేసిన ప్రయత్నం అందుకే అంత థ్రిల్లింగ్‌గా ఉంటుంది! ఒకరు శాస్త్రవేత్తగా నిత్యం వైరస్‌లతో పోరాడేవాళ్లైతే... ఇంకొకరు ఆర్థికవ్యూహకర్తగా ఆ పోరాటానికి గట్టి పునాదిని ఇచ్చేవారు! కొవాగ్జిన్‌ రూపకల్పనలో ఆ ఇద్దరి ప్రయాణంలోని కొన్ని కీలక మలుపులివి...

  • సీఎం అభ్యర్థి తేలినా.. సిగపట్లు ఆగేనా?

పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్​లో వింత పరిస్థితి తలెత్తింది. నేడు రాహుల్​ గాంధీ పంజాబ్​లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగానే సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే, పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు ఇంతటితో ఆగిపోతాయా? రాష్ట్ర పార్టీ నాయకత్వం మొత్తం ఏకతాటిపై నిలిచి ఎన్నికల్లో పోరాడుతుందా?

  • ముగ్గురు పాక్​ స్మగ్లర్లు హతం..

జమ్ముకశ్మీర్​లోని సాంబా సరిహద్దులో అక్రమంగా భారత్​లోకి చొరబడుతున్న ముగ్గురు పాక్​ స్మగ్లర్లను బీఎస్​ఎఫ్​ బలగాలు మట్టుబెట్టాయి. వారి నుంచి 36 కిలోల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి.

  • కీచక ఉపాధ్యాయుడు..

విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు దారి తప్పాడు. నాలుగో తరగతి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం తెలుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

  • కుర్రాళ్లకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ

అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచిన యువ భారత జట్టుకు భారీ నజరానా ప్రకటించింది బీసీసీఐ. ఆటగాళ్లకు ఒక్కొక్కరికీ రూ.40లక్షలు, సహాయ సిబ్బందికి రూ.25 లక్షల చొప్పున నగదు బహుమతి అందించనున్నట్లు తెలిపింది.

  • దివికేగిన అమృతగానం..

భారతీయులు గర్వించదగ్గ పాటలు పాడి చరిత్రలో నిలిచిన గాయని లతా మంగేష్కర్ కన్నుమూశారు. అనేక రోజులుగా ముంబయి బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఓ నేపథ్య గాయకురాలిగా మొదలైన ఆమె.. ప్రఖ్యాత గాయనిగా పేరు తెచ్చుకున్నారు.

  • ఏడు దశాబ్దాల ప్రయాణం.. వేల గీతాల నిలయం

తన గాన మాధుర్యంతో శ్రోతల మనుసు దోచుకున్న లతా మంగేష్కర్​ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అభిమానుల్ని కంటతడి పెట్టిస్తూ తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా ఆమె సంగీత ప్రయాణంపై ప్రత్యేక కథనం.

  • ఆమె పాట.. సంగీత దర్శకులకు గౌరవం

సినీ సంగీత ప్రపంచంలో ఎన్నో మధుర గీతాలకు ప్రాణం పోశారు ప్రముఖ గాయని లతా మంగేష్కర్. ఈమెతో పాట పాడించడాన్ని భారతీయ సంగీత దర్శకులు గౌరవంగా భావించేవారు.

  • లతా మంగేష్కర్.. నటిగా ఎంట్రీ, స్టార్ సింగర్​గా చరిత్ర!

ప్రముఖ గాయని లతా మంగేష్కర్​.. అనారోగ్య సమస్యతో ముంబయిలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. నటిగా కెరీర్​ మొదలుపెట్టి.. భారతదేశం గర్వించదగ్గ సింగర్​గా​ ఎలా ఎదిగారో చెప్పేదే ఈ ప్రత్యేక కథనం.

  • దేశంలో తగ్గిన కొవిడ్​ కేసులు

భారత్​లో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 1,07,474 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. ఒక్కరోజులోనే 865 మంది మరణించారు. దేశంలో పాజిటివిటీ రేటు 7.42 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

  • హమారా భారత్‌ బయోటెక్‌ మహాన్‌..

ఓ సైంటిస్టు ల్యాబ్‌లో చేసే పరిశోధన... సై-ఫై థ్రిల్లర్‌లా అనిపిస్తుందా! పరీక్షనాళికల నడుమ చేసే ప్రయోగాలూ... పట్టువీడకుండా చదివిస్తాయా! మామూలు పరిస్థితుల్లో సాధ్యంకాదేమో కానీ... ఆ కథలోని విలన్‌ ప్రపంచాన్ని గడగడలాడించే వైరస్‌ అయినప్పుడు... సాధారణ సంఘటనలు కూడా ఓ అద్భుత కథలా అనిపిస్తాయి. ‘పద్మభూషణ్‌’ కృష్ణమూర్తి- సుచిత్ర ఎల్ల దంపతులు కొవాగ్జిన్‌ కోసం చేసిన ప్రయత్నం అందుకే అంత థ్రిల్లింగ్‌గా ఉంటుంది! ఒకరు శాస్త్రవేత్తగా నిత్యం వైరస్‌లతో పోరాడేవాళ్లైతే... ఇంకొకరు ఆర్థికవ్యూహకర్తగా ఆ పోరాటానికి గట్టి పునాదిని ఇచ్చేవారు! కొవాగ్జిన్‌ రూపకల్పనలో ఆ ఇద్దరి ప్రయాణంలోని కొన్ని కీలక మలుపులివి...

  • సీఎం అభ్యర్థి తేలినా.. సిగపట్లు ఆగేనా?

పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్​లో వింత పరిస్థితి తలెత్తింది. నేడు రాహుల్​ గాంధీ పంజాబ్​లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగానే సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే, పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు ఇంతటితో ఆగిపోతాయా? రాష్ట్ర పార్టీ నాయకత్వం మొత్తం ఏకతాటిపై నిలిచి ఎన్నికల్లో పోరాడుతుందా?

  • ముగ్గురు పాక్​ స్మగ్లర్లు హతం..

జమ్ముకశ్మీర్​లోని సాంబా సరిహద్దులో అక్రమంగా భారత్​లోకి చొరబడుతున్న ముగ్గురు పాక్​ స్మగ్లర్లను బీఎస్​ఎఫ్​ బలగాలు మట్టుబెట్టాయి. వారి నుంచి 36 కిలోల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి.

  • కీచక ఉపాధ్యాయుడు..

విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు దారి తప్పాడు. నాలుగో తరగతి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం తెలుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

  • కుర్రాళ్లకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ

అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచిన యువ భారత జట్టుకు భారీ నజరానా ప్రకటించింది బీసీసీఐ. ఆటగాళ్లకు ఒక్కొక్కరికీ రూ.40లక్షలు, సహాయ సిబ్బందికి రూ.25 లక్షల చొప్పున నగదు బహుమతి అందించనున్నట్లు తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.