ETV Bharat / city

టాప్ టెన్ న్యూస్ @ 3 PM - తెలంగాణ ప్రధాన వార్తలు

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

Top ten news @ 3 PM
టాప్ టెన్ న్యూస్ @ 3 PM
author img

By

Published : May 18, 2021, 3:02 PM IST

హౌస్ సర్జన్లు, పీజీ వైద్యుల స్టయిఫండ్ పెంపు

రాష్ట్రంలో హౌస్ సర్జన్లు, పీజీ వైద్యుల స్టయిఫండ్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్టయిఫండ్‌ను 15 శాతం పెంచుతూ వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

మరోసారి విమర్శలు.!

మాజీ మంత్రి ఈటల, మంత్రి గంగుల మరోసారి పరస్పర విమర్శలకు దిగారు. ఒకరికొకరు సవాళ్లు విసురుకున్నారు. బ్లాక్​మెయిల్​ రాజకీయాలు మానుకోవాలని పరోక్షంగా గంగులను ఈటల హెచ్చరించగా.. ఈటల బెదిరింపులకు భయపడే వారెవరూ లేరంటూ గంగుల దీటుగా సమాధానం ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

'మహా'లో 11మంది బలి

తౌక్టే తుపాను మహారాష్ట్రను అతలాకుతలం చేసింది. తుపాను ధాటికి రాష్ట్రంలో ఇప్పటివరకు 11 మంది మరణించారు. 12వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి. దాదాపు 15వేల మందిని పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

'టీకాల సరఫరాకు నిరంతర ప్రయత్నాలు'

కరోనా టీకాల సరఫరా పెంచేందుకు నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. టీకా పంపిణీపై 15 రోజుల షెడ్యూల్​ను రాష్ట్రాలకు ముందుగానే అందించనున్నట్లు తెలిపారు. కరోనాపై పోరులో జిల్లా స్థాయి అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

బ్లాక్​ ఫంగస్​పై మార్గదర్శకాలు!

బ్లాక్​ ఫంగస్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ వ్యాధి చికిత్సకు ఎయిమ్స్​ మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. రోగనిరోధక శక్తి తక్కువ ఉండటం, మధుమేహంతో బాధపడుతున్న వారికే ఈ వ్యాధి వస్తున్నట్లు కేంద్రం ఇటీవల స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

సీఎం ప్రమాణ స్వీకారానికి అడ్డంకులు!

కేరళ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్న పినరయ్ విజయన్​కు అవరోధాలు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో కొవిడ్ విజృంభణ కారణంగా ప్రమాణ స్వీకార వేదికను మార్చాలని హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. మరోవైపు... సీపీఎం పార్లమెంటరీ పార్టీ నేతగా విజయన్ ఎన్నికయ్యారు. సిట్టింగ్ మంత్రులెవరికీ కొత్త కేబినెట్​లో చోటు దక్కలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

అందుకే గొంతుకోసుకున్నాడు!

అమెరికాలో ఓ నిందితుడు కోర్టులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ధర్మాసనం అతనికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వగా.. మనస్తాపానికి గురై న్యాయస్థానంలోనే గొంతుకోసుకుని మరణించినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

మస్క్ పేరుతో మస్కా

గడచిన ఆరు నెలల్లో క్రిప్టోకరెన్సీ వినియోగదారులు స్కామర్ల వలలో చిక్కుకుని 2 మిలియన్ డాలర్లు నష్టపోయినట్లు ఫెడరల్ ట్రేడ్​ కమిషన్​ నివేదిక వెల్లడించింది. ఎలాన్​ మస్క్​ పేరు వాడుకుని ఎక్కువగా ఈ మోసాలు జరిగినట్లు గుర్తించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

సీఫెర్ట్​కు నెగిటివ్.!

న్యూజిలాండ్ క్రికెటర్ టిమ్ సీఫెర్ట్​కు కరోనా నెగిటివ్​గా తేలింది. దీంతో ఇతడు భారత్​ నుంచి న్యూజిలాండ్ పయనమయ్యాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

'పుష్ప 2' కోసం కొత్త టైటిల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'పుష్ప'. ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందించబోతున్నారు. అయితే రెండో భాగానికి ఓ ప్రత్యేకమైన టైటిల్​ను పెట్టాలని చిత్రబృందం యోచిస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.