కాకతీయలో పీవీ పీఠం
కాకతీయ వర్సిటీలో పీవీ పీఠం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పీవీ మార్గ్‌లోని జ్ఞానభూమిలో నిర్వహించిన పీవీ శతజయంతి ముగింపు ఉత్సవాల్లో(PV Narasimha Rao Centenary Celebrations) పాల్గొన్నారు. పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి అంటూ కొనియాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఆయన సేవలు చిరస్మరణీయం
ఇందిరా భవన్‌లో పీవీ శతజయంతి ముగింపు ఉత్సవాలను జూమ్ ద్వారా నిర్వహించారు. ఆయన రాష్ట్రానికి, దేశానికి చేసిన సేవలు మరువలేనివని కాంగ్రెస్ నేతలు కొనియాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఆ జిల్లాల్లో మాత్రమే సడలింపు
ఆంధ్రప్రదేశ్‌లోని ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూను మరింతగా సడలిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సడలింపులు ఇచ్చారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ కొనసాగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'ఎవరిదీ నిర్లక్ష్యం ?'
ఏపీలోని తిరుపతి రుయా ఆసుపత్రి ఘటనపై ఆ రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం ఎవరి నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగిందో తేల్చాలని.. ప్రభుత్వం, పోలీసులు, ఆసుపత్రి అధికారులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'ఆ అవసరం రాకుండా ఉత్పత్తి'
హైదరాబాద్ దోమలగూడలో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భాజపా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ సందర్శించారు. కరోనా మూడోదశ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యాక్సినేషన్ పంపిణీలో రాష్ట్రాలు విఫలమయ్యాయని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'వాటిపై స్టే ఇవ్వలేం'
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఐటీ నిబంధనలపై స్టే ఇవ్వాలని పలు మీడియా సంస్థలు దాఖలు చేసిన వ్యాజ్యంపై దిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. నిబంధనల అమలుపై స్టే ఇవ్వడం కుదరదని న్యాయస్థానం స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద డ్యామ్
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జలవిద్యుత్తు డ్యామ్‌ను చైనా ప్రారంభించింది. జిన్షా నదిపై నిర్మించిన 'ది బైహేతన్' డ్యాంలో మొత్తం 16 యూనిట్లు ఉండగా.. రెండు యూనిట్లు సోమవారం ఆరంభమయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కార్లలో అవి తప్పనిసరి
దేశంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో అన్ని కార్లలోనూ ఎయిర్‌బ్యాగ్స్ తప్పనిసరిగా ఉండాలన్న నిబంధనను 2021 డిసెంబర్ 31వరకు వాయిదా వేసింది కేంద్రం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మరో ఛాలెంజ్‌కు సిద్ధం
మరో ఛాలెంజ్‌కు భారత క్రికెట్ జట్టు సిద్ధమైంది. గత 14 రోజులుగా క్వారంటైన్లో మన బృందం.. శ్రీలంకకు సోమవారం పయనమైంది. తొలి మ్యాచ్ జులై 13న జరగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఇంటి కోసం రూ.150 కోట్లు!
తన కొత్త ఇంటి కోసం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) భారీగా ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హాలీవుడ్లో ఓ సినిమా సహా ఇక్కడ పలు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">