ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్ న్యూస్ @ 9PM
టాప్ న్యూస్ @ 9PM
author img

By

Published : Mar 11, 2022, 8:59 PM IST

Godavari Board Meeting: గోదావరి నదీ యాజమాన్య బోర్డు 13వ సమావేశం వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్‌ సభ్యులు రాకపోవడంతో జీఆర్‌ఎంబీ సమావేశం వాయిదా వేశారు. ఏపీ సభ్యుల గైర్హాజరు పట్ల తెలంగాణ నీటిపారుదల ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.

  • 'అందుకే భాజపాకు అధికారం'

PM Narendra Modi: ఇటీవల ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలకు గానూ.. నాలుగు రాష్ట్రాల్లో భాజపా అధికారంలోకి రావడానికి ప్రజలు అభివృద్ధిని చూసి ఓటు వేయడమే ముఖ్య కారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సొంత రాష్ట్రమైన గుజరాత్​లో పర్యటించిన మోదీ.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు.

  • హస్తానికి కష్టకాలం.. నాయకత్వ లోపమే శాపం

Congress news: ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసింది కాంగ్రెస్. గెలిచే అవకాశమున్న పంజాబ్​, ఉత్తరాఖండ్​లోనూ ఏ మాత్రం పోటీ ఇవ్వలేక పోయింది. ఈ ఫలితాలు హస్తం పార్టీ భవిష్యత్​ను దెబ్బకొట్టాయని విశ్లేషకులు చెబుతున్నారు. నాయకత్వ లోపమే ఆ పార్టీకి శాపం అంటున్నారు.

  • పరీక్షల షెడ్యూల్‌ విడుదల

CBSE term-II board exams: 10, 12వ తరగతుల టర్మ్​-2 పరీక్షల షెడ్యూల్​ను సీబీఎస్​ఈ బోర్డ్​ ప్రకటించింది. వచ్చే నెల 26 నుంచి థియరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది.

  • కూలిన ఆర్మీ హెలికాప్టర్​

Helicopter Crash: జమ్ముకశ్మీర్​లో సైన్యానికి చెందిన హెలికాప్టర్​ కూలింది. సమీపాన ఉన్న ఓ స్థావరం నుంచి సైనికుడిని తరలించేందుకు వెళ్తున్న క్రమంలో ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో కో-పైలట్​ ప్రాణాలు కోల్పోయారు.

  • పాక్​ భూభాగంలోకి దూసుకెళ్లిన భారత క్షిపణి

భారత రక్షణ వ్యవస్థకు చెందిన క్షిపణి పొరపాటున పాకిస్థాన్​ భూభాగంలోకి దూసుకెళ్లింది. రోజూవారీ పరీక్షల్లో భాగంగా భారత్‌ ప్రయోగించిన క్షిపణిలో.. సాంకేతిక లోపం తలెత్తడం వల్ల పాకిస్థాన్​వైపు దూసుకెళ్లినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. ఈనెల 9న జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేసింది.

  • పేటీఎంకు ఆర్​బీఐ షాక్‌- దానిపై బ్యాన్

RBI on paytm payment bank:పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​పై ఆర్​బీఐ నిషేధం విధించింది. కొత్తగా కస్టమర్లను చేర్చుకోవద్దని సంస్థను ఆదేశించింది.

  • ప్రేమకు, విధికి మధ్య జరిగిన యుద్ధంలో గెలుపెవరిది?

Radheshyam movie review: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలైంది. బాహుబలి, సాహో తర్వాత భారీ అంచానాలతో వచ్చిన ఈ చిత్ర అభిమానలను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూడండి.

  • కేసీఆర్​కు వారం రోజుల విశ్రాంతి అవసరం

Doctors on KCR Health: సాధారణ పరీక్షల్లో భాగంగానే ముఖ్యమంత్రికి మెడికల్​ టెస్టులు చేసినట్లు యశోద ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. పర్యటన, ఉపన్యాసాలు చేయడం వల్ల నీరసంగా ఉన్నారని వైద్యులు వివరించారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు పేర్కొన్నారు.

  • ఆ 2 తేదీల్లో ఆర్టీసీ బస్సులు బంద్

TSRTC Employees Samme: ఈ నెల 28, 29 తేదీల్లో ఆర్టీసీ సంఘాలు సమ్మెలో పాల్గొననున్నాయి. జాతీయ కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఆర్టీసీ జేఏసీ సంఘాలు యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చాయి.

  • జీఆర్ఎంబీ సమావేశం వాయిదా... అందుకే..!

Godavari Board Meeting: గోదావరి నదీ యాజమాన్య బోర్డు 13వ సమావేశం వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్‌ సభ్యులు రాకపోవడంతో జీఆర్‌ఎంబీ సమావేశం వాయిదా వేశారు. ఏపీ సభ్యుల గైర్హాజరు పట్ల తెలంగాణ నీటిపారుదల ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.

  • 'అందుకే భాజపాకు అధికారం'

PM Narendra Modi: ఇటీవల ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలకు గానూ.. నాలుగు రాష్ట్రాల్లో భాజపా అధికారంలోకి రావడానికి ప్రజలు అభివృద్ధిని చూసి ఓటు వేయడమే ముఖ్య కారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సొంత రాష్ట్రమైన గుజరాత్​లో పర్యటించిన మోదీ.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు.

  • హస్తానికి కష్టకాలం.. నాయకత్వ లోపమే శాపం

Congress news: ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసింది కాంగ్రెస్. గెలిచే అవకాశమున్న పంజాబ్​, ఉత్తరాఖండ్​లోనూ ఏ మాత్రం పోటీ ఇవ్వలేక పోయింది. ఈ ఫలితాలు హస్తం పార్టీ భవిష్యత్​ను దెబ్బకొట్టాయని విశ్లేషకులు చెబుతున్నారు. నాయకత్వ లోపమే ఆ పార్టీకి శాపం అంటున్నారు.

  • పరీక్షల షెడ్యూల్‌ విడుదల

CBSE term-II board exams: 10, 12వ తరగతుల టర్మ్​-2 పరీక్షల షెడ్యూల్​ను సీబీఎస్​ఈ బోర్డ్​ ప్రకటించింది. వచ్చే నెల 26 నుంచి థియరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది.

  • కూలిన ఆర్మీ హెలికాప్టర్​

Helicopter Crash: జమ్ముకశ్మీర్​లో సైన్యానికి చెందిన హెలికాప్టర్​ కూలింది. సమీపాన ఉన్న ఓ స్థావరం నుంచి సైనికుడిని తరలించేందుకు వెళ్తున్న క్రమంలో ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో కో-పైలట్​ ప్రాణాలు కోల్పోయారు.

  • పాక్​ భూభాగంలోకి దూసుకెళ్లిన భారత క్షిపణి

భారత రక్షణ వ్యవస్థకు చెందిన క్షిపణి పొరపాటున పాకిస్థాన్​ భూభాగంలోకి దూసుకెళ్లింది. రోజూవారీ పరీక్షల్లో భాగంగా భారత్‌ ప్రయోగించిన క్షిపణిలో.. సాంకేతిక లోపం తలెత్తడం వల్ల పాకిస్థాన్​వైపు దూసుకెళ్లినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. ఈనెల 9న జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేసింది.

  • పేటీఎంకు ఆర్​బీఐ షాక్‌- దానిపై బ్యాన్

RBI on paytm payment bank:పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​పై ఆర్​బీఐ నిషేధం విధించింది. కొత్తగా కస్టమర్లను చేర్చుకోవద్దని సంస్థను ఆదేశించింది.

  • ప్రేమకు, విధికి మధ్య జరిగిన యుద్ధంలో గెలుపెవరిది?

Radheshyam movie review: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలైంది. బాహుబలి, సాహో తర్వాత భారీ అంచానాలతో వచ్చిన ఈ చిత్ర అభిమానలను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూడండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.