ETV Bharat / city

Telangana Top news 9PM టాప్​ న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

9PM TOPNEWS
9PM TOPNEWS
author img

By

Published : Aug 25, 2022, 8:58 PM IST

  • గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్టు

అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ను హైదరాబాద్ పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. మంగళ్​హాట్​, షాహినాయత్​గంజ్​ పోలీస్​స్టేషన్లలో నమోదైన కేసులపై పోలీసులు 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు.

  • నా ప్రాణం ఉన్నంత వరకు రాష్ట్రాన్ని ఆగం కానివ్వనన్న కేసీఆర్

దేశం బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రం ఇప్పటి వరకు ఒక్క మంచి పనిచేయలేదని మండిపడ్డారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నప్పుడు దేశంలో ఎందుకు ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

  • బుజ్జగించిన భట్టి, ప్రచారానికి వెళ్తానన్న కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ ఎవరిని ఎంపిక చేసినా అభ్యంతరం లేదని ఆ పార్టీ స్టార్​ క్యాంపెయినర్​, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి పేర్కొన్నారు. సర్వేల ప్రకారం అభ్యర్థి ఎంపిక ఉంటుందని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి తాను వెళ్తానని స్పష్టం చేశారు.

  • తాము ఎదగడానికి ఏ పార్టీనైనా చీలుస్తామన్న ఎంపీ అర్వింద్

తాము ఎదగడానికి ఏ పార్టీనైనా చీలుస్తామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. ఆయన జన్మదినం సందర్భంగా ఏపీలోని బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం విజయవాడ భాజపా రాష్ట్ర కార్యాలయంలో జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.

  • చంద్రబాబు భద్రతపై ఎన్​ఎస్​జీ ఆరా

తెదేపా కేంద్ర కార్యాలయాన్ని ఎన్‌ఎస్‌జీ ఐజీ పరిశీలించారు. చంద్రబాబు పర్యటనల్లో గొడవలు జరగటంపై దృష్టి సారించిన ఎన్‌ఎస్‌జీ.. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసాన్ని సైతం పరిశీలించింది. తన పర్యటనలో దాడులపై తెదేపా నేతలు ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పరిశీలనకు వచ్చినట్లు తెదేపా వర్గాలు తెలిపాయి.

  • టిక్​టాక్ స్టార్ మృతి కేసులో ట్విస్ట్

టిక్​టాక్ స్టార్, భాజపా నేత సోనాలీ ఫోగాట్ మృతిపై హత్య కేసు నమోదు చేశారు పోలీసులు. ఆమె సహాయకులు ఇద్దరిని నిందితులుగా చేర్చారు. వీరిని అరెస్టు చేశారు.

  • న్యాయపాలనా దక్షుడు, వాస్తవికవాది, అత్యుత్తమ భారత ప్రధాన న్యాయమూర్తి

న్యాయవ్యవస్థ అవసరాలను తీర్చేందుకు జస్టిస్‌ ఎన్‌.వి.రమణ విశేషంగా కృషి చేశారని పలువురు న్యాయవాదులు ప్రశంసించారు. భారత ప్రధాన న్యాయమూర్తులలో ఆయన అత్యుత్తమమైనవారని కొనియాడారు. అద్భుతమైన ప్రగతిశీల దృక్పథం ఉన్న ఆయన న్యాయ వ్యవస్థ అవసరాలను వేగంగా తీర్చగలిగారని ప్రశంసలు కురిపించారు.

  • కరోనా, మంకీపాక్స్‌, హెచ్ఐవీ మూడూ ఒకేసారి, ఒకే వ్యక్తికి

కరోనా మహమ్మారి, మంకీపాక్స్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇటలీకి చెందిన 36 ఏళ్ల వ్యక్తికి ఒకే సమయంలో కరోనా వైరస్‌, మంకీపాక్స్‌,హెచ్‌ఐవీ సోకినట్లు తేలడం కలకలం రేపింది.

  • క్రికెట్​ ఫ్యాన్స్​కు గుడ్‌న్యూస్‌, భారత్​ పాక్​ మ్యాచ్​ టికెట్స్​ రిలీజ్​

క్రికెట్​ అభిమానులకు గుడ్​ న్యూస్​. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్​లో భాగంగా జరగబోయే భారత్​ పాకిస్థాన్ మ్యాచ్​కు సంబంధించి నాలుగు వేలకుపైగా స్టాండింగ్‌ రూమ్‌ టికెట్లను విడుదల చేసింది ఐసీసీ. ఒక్కో టికెట్‌ 30 ఆస్ట్రేలియన్ డాలర్లకు ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌ పద్ధతిలో కేటాయిస్తామని వెల్లడించింది.

  • అదుర్స్‌ అనిపించేలా ది ఘోస్ట్‌ ట్రైలర్‌

నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ది ఘోస్ట్‌. ఈ సినిమా ట్రైలర్‌ని విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన లైగర్‌ ఆడుతున్న థియేటర్లలో గురువారం ఉదయం ప్రదర్శించారు. తాజాగా నటుడు మహేశ్‌బాబు సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.