ETV Bharat / city

రేపు అసెంబ్లీలో నూతన రెవెన్యూ చట్టంపై చర్చ - నూతన రెవెన్యూ చట్టం

రాష్ట్ర అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు నాలుగో రోజున ప్రభుత్వం మరో నాలుగు బిల్లులను... శాసనసభలో ప్రవేశపెట్టింది. గతంలో జారీ చేసిన ఆర్డినెన్స్‌ల స్థానంలో ఈ బిల్లులను తెచ్చింది. జీరోఅవర్‌లో కాంగ్రెస్‌ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి కేటీఆర్​కు మధ్య స్వల్ప సంవాదం చోటుచేసుకుంది. శుక్రవారం రెవెన్యూ బిల్లుపై చర్చించనున్నారు.

tomorrow Debate on the new Revenue Act in Telangana Assembly
రేపు నూతన రెవెన్యూ చట్టంపై చర్చ
author img

By

Published : Sep 10, 2020, 10:57 PM IST

రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నాలుగో రోజు శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లిని ఛైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ప్రారంభించారు. ప్రశ్నో‌త్త‌రాలు.. జీరో అవర్‌ అనం‌తరం ప్రభుత్వం నాలుగు బిల్లు‌లను ప్రవే‌శ‌పెట్టింది. గతంలో జారీ చేసిన ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులను సర్కార్‌ తీసుకువచ్చింది.

మరో నాలుగు బిల్లులు...

ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టసవరణ బిల్లు, ఆయుష్ వైద్యుల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచే బిల్లు, విపత్కర పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించే బిల్లు, 1435 కోట్ల రూపాయల అదనపు అప్పు తీసుకునే వెసులుబాటు కల్పించే బిల్లులు ఇందులో ఉన్నాయి. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లును మంత్రి సబితా ప్రవేశపెట్టగా... మిగతా మూడు బిల్లులను హరీశ్‌రావు తరపున మంత్రి కేటీఆర్‌ ప్రవేశపెట్టారు.

అభివృద్ధికే భూములు

వినియోగంలో లేని పారిశ్రామిక భూములను వెనక్కి తీసుకుంటామని మంత్రి కేటీఆర్​ పునరుద్ఘాటించారు. అవసరానికి మించి కర్మాగారాలకు స్థలాలు ఇవ్వడం లేదన్న మంత్రి..... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పారిశ్రామిక వాడల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించామని వివరించారు. భూనిర్వాసితలకు పరిహారం, హైదరాబాద్ ఫార్మాసిటీ భూసేకరణ ప్రక్రియపై శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్​ సమాధానం ఇచ్చారు. ఫార్మాసిటీ భూనిర్వాసితులకు చట్టపరంగా పూర్తి పరిహారం అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఐతే కొందరు విపక్ష నేతలు రాజకీయ దురుద్దేశంతో అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.... ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తోందని కేటీఆర్​ తెలిపారు.

స్వల్ప సంవాదం...

జీరోఅవర్‌ సమయంలో కాంగ్రెస్‌ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య స్వల్ప సంవాదం చోటుచేసుకుంది. మునుగోడు, చండూరు మున్సిపాలిటీల్లో ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కేటీఆర్ విపక్షాలు అవాస్తవాలు ప్రచారం చేయొద్దని.. ఇటీవల మున్సిపాలిటీ ఎన్నికల్లో ఫలితాలే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని స్పష్టం చేశారు.

కేంద్రం ఇచ్చింది శూన్యం

వినూత్న కార్యక్రమాలతో గ్రామపంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. పంచాయతీల అభివృద్ధి, ఆసరా పింఛన్ల మంజూరుపై శాసనసభలో పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. కరోనా కారణంగా పింఛన్ల వయోపరిమితి తగ్గింపు సర్వే ఆలస్యమైందన్న మంత్రి.... త్వరలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పింఛన్లకు నిధులిస్తున్నట్లు భాజపా తప్పుడు ప్రచారం చేస్తుందని మంత్రి పేర్కొన్నారు.

ఇవీచూడండి: విద్యా సంవత్సరం ఖరారు చేసిన ఇంటర్ బోర్డు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.