లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్)పై ప్రభుత్వ వివరణ తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఎల్ఆర్ఎస్ను సవాల్ చేస్తూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలతో పాటు మరో పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డి ధర్మాసనం నేడు మరోసారి విచారణ చేపట్టింది.
ఎల్ఆర్ఎస్కు సంబంధించిన అన్ని వ్యాజ్యాలపై ఈ నెల 11లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే అప్పటి వరకు ఎల్ఆర్ఎస్ ప్రక్రియ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరారు. ప్రభుత్వం కౌంటరు దాఖలు చేయక ముందే ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని ధర్మాసనం పేర్కొంది. విచారణను ఈనెల 12కి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: గనుల్లో మెరిసిన సంధ్య.. భారత మైనింగ్ రంగ మొదటి మహిళగా గుర్తింపు