Tension At Anna Canteen: ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తెనాలిలో తెదేపా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను తీసేయాలని మున్సిపల్ అధికారుల ఆదేశించటంతో వివాదం చెలరేగింది. మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద గత నెల 12న అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. అయితే క్యాంటీన్ తీసేయాలని రెండు రోజుల క్రితం మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని నోటీసుల్లో పేర్కొన్నారు.
అన్న క్యాంటీన్‌కు పోటీగా అక్కడే వైకాపా నేతలు కూడా ఐదు రోజుల క్రితం క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం వైకాపా టెంట్‌ను అధికారులు తొలగించారు. తెదేపా వాళ్ల టెంట్ ఆహారం పంపిణీ చేశాక వాళ్లే తీసుకెళ్తున్నారు. ఇవాళ కూడా అక్కడే ఆహారం పంపిణీ చేస్తామని తెదేపా నేతలు చెబుతున్నారు. దీంతో ఆందోళనలు జరుగుతాయనే అనుమానంతో పోలీసుల మొహరించారు. భారీగా పోలీసు బలగాలను మొహరించటంతో మార్కెట్ సెంటర్లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. దుకాణాలను కూడా బలవంతంగా మూసివేయించారు. చిరు వ్యాపారులపైనా ఆంక్షలు విధించారు.
ఇవీ చదవండి: ఆ అధికారి.. సైంధవ పాత్రధారి
దేశంలో పెరిగిన కొవిడ్ కేసులు.. 33 మంది మృతి.. జపాన్‌లో ఆగని విలయం