ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @3PM - తెలంగాణ ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​ టెన్​ న్యూస్​ @3PM
టాప్​ టెన్​ న్యూస్​ @3PM
author img

By

Published : Jan 1, 2022, 2:59 PM IST

  • పెట్టుబడి సాయం విడుదల

Kisan Samman Nidhi: ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి 10వ విడత నిధులను విడుదల చేశారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా వర్చువల్​గా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులతో మాట్లాడారు.

  • 'రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తాం'

Shaikpet Flyover Opening: కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. హైదరాబాద్​లో స్కైవేల నిర్మాణానికి కేంద్రం సహకరించాలని కోరారు. ఎస్​ఆర్​డీపీ ప్రాజెక్టు కింద నగరంలో నిర్మించిన అతి పెద్ద పైవంతెన షేక్​పేట్​ ఫ్లై ఓవర్​ను కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి, మంత్రి కేటీఆర్​ ప్రారంభించారు.

  • 'రీజినల్ రింగ్‌రోడ్ తెలంగాణకు మరో మణిహారం'

Union Minister Kishan reddy: హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కిషన్​ రెడ్డి సూచించారు. నగరంలో స్కైవేల ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉందని స్పష్టం చేశారు. రీజినల్​ రింగ్​రోడ్డుకు సంబంధించి త్వరగా భూ సేకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. నగరంలో నిర్మించిన షేక్​పేట్​ ఫ్లైఓవర్​ను మంత్రి కేటీఆర్​తో కలిసి కిషన్​ రెడ్డి ప్రారంభించారు.

  • కశ్మీర్​లో గుప్కార్​ నేతల గృహనిర్భందం!

gupkar alliance leaders arrest: పునర్విభజన ​ కమిషన్​ సిఫార్సులను వ్యతిరేకిస్తూ గుప్కార్​ కమిటీ చేపట్టబోయిన ఆందోళనలను జమ్ము కశ్మీర్​ పోలీసులు అడ్డుకున్నారు. గుప్కార్​ నేతలను ముందస్తుగానే గృహనిర్భందంలోకి తీసుకున్నారు.

  • సరిహద్దులో స్వీట్లు పంచుకున్న భారత్, పాక్​ జవాన్లు

కొత్త ఏడాది సందర్భంగా భారత్‌, పాకిస్థాన్‌ సైనికులు పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద ఉన్న మెంధార్‌ హాట్‌ స్ప్రింగ్స్​, పూంచ్‌ రావల్‌ కోట్‌, చకోటి ఉరి, చిల్లియానా తివాల్‌ క్రాసింగ్‌ పాయింట్ల వద్ద మిఠాయిలు ఇచ్చిపుచ్చుకున్నారు. పరస్పరం కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

  • 'కలిసికట్టుగా పనిచేస్తేనే.. కొవిడ్-19​కు ముగింపు'

Tedros Adhanom on Covid: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న దేశాల మధ్య నెలకొన్న అసమానతలు అంతమైతేనే.. కరోనా మహమ్మారికి ముగింపు లభిస్తుందన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్​ అధనోమ్​. దేశాలన్ని కలిసికట్టుగా పనిచేస్తే.. 2022లోనే కొవిడ్​ ముగుస్తుందనే నమ్మకం ఉన్నట్లు చెప్పారు.

  • ఏపీ, తెలంగాణలో బంగారం ధర ఇలా..

Gold Price Today: దేశంలో బంగారం ధర రూ.220 పెరిగింది. వెండి ధర కూడా రూ. 500 మేర వృద్ధి చెందింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

  • ఘనంగా టీమ్​ఇండియా న్యూ ఇయర్​ సెలబ్రేషన్స్​

Teamindia New Year celebrations: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమ్​ఇండియా న్యూ ఇయర్​ వేడుకలను ఘనంగా జరుపుకొంది. ఆటగాళ్లంతా కేక్​ కట్​ చేసి సరదాగా గడిపారు. వాటిని సంబంధించిన ఫొటోలను కోహ్లీ సోషల్​మీడియాలో పోస్ట్​ చేశాడు. కాగా, దిగ్గజ క్రికెటర్లు సచిన్​, సెహ్వాగ్​, లక్ష్మణ్​ సహా పలువురు మాజీలు సోషల్​మీడియా ద్వారా ఫ్యాన్స్​కు స్పెషల్​ విషెస్​ తెలిపారు.

  • షణ్ముఖ్-దీప్తి సునయన జోడీ బ్రేకప్

Depthi sunaina shanmukh: యూట్యూబర్స్​ దీప్తి సునయన, షణ్ముక జస్వంత్.. తమ ప్రేమ బంధానికి బ్రేకప్​ చెప్పేశారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

  • 'రాధేశ్యామ్' కొత్త పోస్టర్.. సంక్రాంతికి సినిమా పక్కా

Radhe shyam movie: 'రాధేశ్యామ్' సినిమా సంక్రాంతి రేసులోనే ఉంది. న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ చేసిన పోస్టర్​తో ఈ విషయం స్పష్టమైంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.