ETV Bharat / city

నేటితో ముగియనున్న పీఆర్సీ కమిషన్​ గడువు... నివేదికపై ఉత్కంఠ

వేతన సవరణ అంశం ఉద్యోగుల్లో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తోంది. పీఆర్సీ కమిషన్​కు ప్రభుత్వం ఇచ్చిన గడువు ఇవాళ్టితో ముగియనుంది. పీఆర్సీ అమలు ఎప్పటి నుంచి ఉంటుంది.. ఎంత శాతం ఇస్తారు అనే విషయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఆర్థిక మాంద్యం ఉందని సర్కారు చెప్తోన్న దృష్ట్యా వేతన సవరణ ఎంతవరకు ఉంటుందన్న అంశంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె తర్వాతే పీఆర్సీపై నిర్ణయం తీసుకోవచ్చనే మాటలు వినిపిస్తున్నాయి.

author img

By

Published : Nov 23, 2019, 7:28 AM IST

Updated : Nov 23, 2019, 10:35 AM IST

ముగిసిన పీఆర్సీ కమిషన్​ గడువు.. నివేదిక ఉఠ్కంఠ
నేటితో ముగియనున్న పీఆర్సీ కమిషన్​ గడువు.. నివేదికపై ఉఠ్కంఠ

ఉద్యోగుల వేతన సవరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కమిషన్​ను ఏర్పాటు చేసింది. విశ్రాంత ఐఏఎస్​ అధికారి సీఆర్​ బిస్వాల్​ నేతృత్వంలో ముగ్గురు సభ్యులను నియమించింది. నెల రోజుల్లోనే నివేదిక సమర్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసినా వివిధ కారణాలతో నివేదిక వాయిదా పడుతూ వచ్చింది. 2018 జులై ఒకటి నుంచి నూతన పీఆర్సీ అమలు కావాల్సి ఉంది. వేతన సవరణతో పాటు, ఇతర అంశాలకు సంబంధించిన విధివిధానాలను కూడా పీఆర్సీ కమిషన్​కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది.

అప్పుడు 43 శాతం ఇప్పడెంత..!

పీఆర్సీ కమిషన్​కు నివేదిక సమర్పించినప్పుడు 63 శాతం ఫిట్​మెంట్ ఇవ్వాలని మెజార్టీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్.. 43 శాతం ఫిట్​మెంట్ ఇచ్చారు. ఈసారి 63 శాతం ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. తీవ్ర ఆర్థిక మాంద్యం ఉందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఫిట్​మెంట్ ఎంత ఇస్తారమన్నది ఆసక్తికరంగా మారింది.

అడిగినంత ఇస్తే రూ.9000 కోట్ల భారం..

ఒక్క శాతం ఫిట్​మెంట్ ఇస్తేనే ప్రభుత్వ ఖజానాపై రూ. 339 కోట్ల అదనపు భారం పడుతుందని ఇప్పటికే ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఆ లెక్కన 20 శాతం ఫిట్​మెంట్ ఇస్తే రూ.6,600 కోట్ల అదనపు భారం పడనుంది. వేతన సవరణ చేస్తే ఇప్పుడున్న మూల వేతనంలో డీఏను కూడా కలపాల్సి ఉంటుంది. ఏడాదికి రెండుసార్లు చొప్పున ఐదేళ్లలో పది డీఏలు వస్తాయి. ఆ మొత్తాన్ని మూలవేతనంలో కలిపి, దానిపై హెచ్ఆర్ఏ సహా ఇతర భత్యాలు లెక్కించాల్సి ఉంటుంది. కేవలం ఈ ప్రక్రియ చేస్తేనే ఖజానాపై రూ.3,000 కోట్ల భారం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. అంటే సున్నాశాతం ఫిట్​మెంట్​ ఇచ్చినా ఖజానాపై రూ.3000 కోట్ల భారం పడుతుంది. 20 శాతం ఫిట్​మెంట్ అంటే సుమారు రూ.9,000 కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మోయాల్సి ఉంటుంది.

ఆర్థిక మాంద్యం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో కొత్తగా పనులేవి చేపట్టడం లేదు. పాత బిల్లుల చెల్లింపులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వేతన సవరణ కోసం ప్రభుత్వం ఎంత మేర భరిస్తుందన్నది చూడాల్సి ఉంది. పీఆర్సీ కమిషన్​ నివేదిక ఇచ్చాక ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమై వేతన సవరణ ప్రకటించే అవకాశం ఉంది. ఆర్టీసీ సమ్మె వ్యవహారం కొలిక్కి వచ్చాకే పీఆర్సీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇవీచూడండి: స్వరూపం మార్చుకోనున్న ప్రజారవాణా

File : TG_Hyd_25_22_PRC_Pkg_3053262 From : Raghu Vardhan ( ) వేతన సవరణ అంశం ఉద్యోగుల్లో ఉత్కంఠ రేపుతోంది. నివేదిక ఇవ్వాలన్న ప్రభుత్వ గడువు ముగుస్తోన్న తరుణంలో ఏం జరుగుతుందన్న విషయమై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అసలే ఓ వైపు ఆర్థికమాంద్యం ఉందని ప్రభుత్వం చెప్తోన్న తరుణంలో వేతన సవరణ ఎంతవరకు ఉంటుందన్న విషమమై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న తరుణంలో ఆ సమ్మె పరిష్కారమయ్యాకే పీఆర్సీ విషయమై నిర్ణయం తీసుకోవచ్చని కూడా అంటున్నారు...లుక్ వాయిస్ ఓవర్ - ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే కమిషన్ ను ఏర్పాటు చేసింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి సీఆర్ బిస్వాల్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కమిషన్ ను ఏర్పాటు చేసింది. నెల రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం అప్పట్లో చెప్పినప్పటికీ వివిధ కారణాల రీత్యా వాయిదా పడుతూ వచ్చింది. వేతన సవరణతో పాటు మరికొన్ని ఇతర అంశాలకు సంబంధించిన విధివిధానాలను కూడా పీఆర్సీ కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. 2018 జూలై ఒకటో తేదీ నుంచి ఉద్యోగులకు వేతన సవరణ అమలు కావాల్సి ఉంది. వీలైనంత త్వరగా పీఆర్సీ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు వివిధ సందర్భాల్లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. వీలైనంత త్వరగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం ఉద్యోగసంఘాలకు హామీ ఇచ్చారు. ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి నివేదిక ఇవ్వాలని ఈ నెల పదో తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ పీఆర్సీ కమిషన్ కు సూచించారు. పది, 12 రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పారు. ఆ గడువు ఇవాళ్టితో ముగుస్తోన్న నేపథ్యంలో వేతనసవరణపై విస్తృతచర్చ జరుగుతోంది. ఎపుడు ఉంటుంది, ఎంత మేరకు ఉండవచ్చన్న విషయమై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పీఆర్సీ కమిషన్ కు నివేదిక ఇచ్చినపుడు 63 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని మెజార్టీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులకు 43శాతం ఫిట్ మెంట్ ఇచ్చారు. దీంతో ఈ మారు 63 శాతం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే తీవ్ర ఆర్థికమాంద్యం ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత మేర ఫిట్ మెంట్ ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఉద్యోగులకు ఒక్క శాతం ఫిట్ మెంట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై 339 కోట్ల అదనపు భారం పడుతుందని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఆ లెక్కన 20 శాతం ఫిట్ మెంట్ ప్రకటించినా ఖజానాపై 6600 కోట్ల అదనపు భారం పడనుంది. దీంతో పాటు వేతన సవరణ చేస్తే ఇప్పుడున్న మూలవేతనంలో డీఏలు కలపాల్సి ఉంటుంది. ప్రతి ఏడాదికి రెండు చొప్పున ఐదేళ్లలో పది డీఏలు వస్తాయి. పది డీఏలను మూల వేతనంలో కలిపి ఆ తర్వాత దానిపై హెచ్ఆర్ఏ సహా ఇతర భత్యాలు లెక్కించాల్సి ఉంటుంది. కేవలం ఈ ప్రక్రియ చేస్తేనే ఖజానాపై 3000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని ఆర్థికశాఖ ఇప్పటికే అంచనా వేసింది. అంటే సున్నాశాతం ఫిట్ మెంట్ ఇచ్చినప్పటికీ 3000 కోట్ల భారం తప్పదని అంటున్నారు. ఆ పై ఎంత శాతం ఫిట్ మెంట్ ఇస్తే అన్ని రెట్ల 339కోట్ల భారం అదనంగా పడనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం 30శాతమైనా ఫిట్ మెంట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. అదే జరిగితే రాష్ట్ర ఖజానాపై 12వేల కోట్ల రూపాయలకు పైగా భారం పడనుంది. 20 శాతం ఫిట్ మెంట్ ఇచ్చినప్పటికీ 9000కోట్ల రూపాయలకు పైగా భారం పడనుంది. తీవ్ర ఆర్థికమాంద్యం కారణంగా ఆదాయాలు గణనీయంగా పడిపోవడంతో రాష్ట్ర ఖజానాకు రాబడి గణనీయంగా తగ్గింది. కొత్తగా పనులేవీ చేపట్టడం లేదు. పాత పనుల బిల్లుల చెల్లింపులకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. మాంద్యం కారణంగా ఆర్టీసీకి కూడా డబ్బులు ఇవ్వలేమని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగుల వేతన సవరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత భారాన్ని భరిస్తుందన్నది చూడాల్సి ఉంది. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో పీఆర్సీ కమిషనర్ కసరత్తు వేగవంతం చేసింది. ఆర్థికశాక ఉన్నతాధికారులతో సమావేశాలు, సంప్రదింపులు కూడా చేసింది. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా నివేదిక ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కమిషన్ నివేదిక ఇచ్చాక ఉద్యోగసంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమై వేతనసవరణ ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న తరుణంలో ఈ ప్రక్రియను ఎప్పుడు పూర్తి చేస్తారన్నది కూడా తేలాల్సి ఉంది. సమ్మె వ్యవహారం కొలిక్కి వచ్చాకే ఉద్యోగుల పీఆర్సీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది.
Last Updated : Nov 23, 2019, 10:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.