Telangana Police Exams Syllabus 2022 : తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) వివిధ విభాగాల్లో కానిస్టేబుల్, ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. ఆయా పోస్టుల వారీ పరీక్ష విధానం, సిలబస్ వివరాలు...
కానిస్టేబుల్ (ఐటీ, కమ్యూనికేషన్లు): సాంకేతిక పరిజ్ఞాన రాతపరీక్షలో 200 మార్కులకు 200 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్-రేడియో, కంప్యూటర్ బేసిక్, టెలిఫోన్ సిస్టమ్ సిలబస్ నుంచి ప్రశ్నలు వస్తాయి.
కానిస్టేబుల్ (మెకానిక్): ఈ పోస్టులకు నిర్వహించే రాతపరీక్షలో 200 మార్కులకు 200 ప్రశ్నలు ఉంటాయి. ఆటోమొబైల్ పరిచయం, స్పార్క్ ఇగ్నీషియన్ ఇంజిన్, పెట్రోలు, డీజిల్ ఇంజిన్ పరికరాలు, నిర్వహణ తదితర అంశాలపై అడుగుతారు.
కానిస్టేబుల్ (డ్రైవర్): వాహన నిర్వహణ, డ్రైవింగ్ విధులు, రోడ్డు చట్టాలు, నిబంధనలు తదితర అంశాలపై 200 ప్రశ్నలు అడుగుతారు. 200 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది.
నోటిఫికేషన్ నం.40
ఎస్సై (ఐటీ, పీటీవో, ఫింగర్ ప్రింట్‌బ్యూరో): ఈ పోస్టులకు రాతపరీక్షలో మూడు పేపర్లు ఉంటాయి. పేపర్-1, 2 పరీక్షలు ఐటీ, పీటీవో, ఫింగర్ ప్రింట్ బ్యూరో విభాగాలకు ఒకే విధంగా ఉంటాయి. పేపర్-1లో ఇంగ్లిష్ సబ్జెక్టుపై 100 మార్కులకు ఆబ్జెక్టివ్ (50 ప్రశ్నలు... 25 మార్కులు), డిస్క్రిప్టివ్ టైప్ (75 మార్కులు) ప్రశ్నలు ఉంటాయి. పదోతరగతి స్థాయి సిలబస్‌పై అడుగుతారు. లేఖలు రాయడం, నివేదికలు, వ్యాసరూప ప్రశ్నలు, పేరాగ్రాఫ్‌లో విషయపరిజ్ఞానం, ఆంగ్ల పఠనం, అవగాహనపై ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. పేపర్-2లో 200 ప్రశ్నలు అరథ్‌మెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీపై ప్రశ్నలు వస్తాయి. పేపర్-3లో సంబంధిత సబ్జెక్టులపై 200 ప్రశ్నలు అడుగుతారు.
ఐటీ పోస్టులు(పేపర్-3): నెట్‌వర్క్ థియరీ, ఎలక్ట్రోమాగ్నటిక్ థియరీ, ఎలక్ట్రానిక్ మెజర్‌మెంట్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, పవర్ ఎల‌్రక్టానిక్స్, అనలాగ్ ఎల‌్రక్టానిక్ సర్క్యూట్స్, డిజిటల్ ఎల‌్రక్టానిక్ సర్క్యూట్స్, కమ్యూనికేషన్ సిస్టమ్ అండ్ యాంటేనా, మైక్రోవేవ్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ఇంజినీరింగ్, డేటాబేస్ మేనేజ్‌మెంట్, నెట్‌వర్కింగ్ - సెక్యూరిటీ మేనేజ్‌మెంట్, మైక్రోప్రాసెసర్స్, టెలివిజన్ ఇంజినీరింగ్, రాడార్స్ అండ్ ల్యాండింగ్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, టెలిఫోన్ సిస్టమ్స్, మల్టీప్లెక్సింగ్ అండ్ మల్టిపుల్ యాక్సెస్ టెక్నిక్స్‌పై ప్రశ్నలు వస్తాయి.
పీటీవో పోస్టులు (పేపర్-3): మెకానికల్ ఇంజినీరింగ్, వర్క్‌షాప్ టెక్నాలజీ, ఆటోమొబైల్ పవర్‌ప్లాంట్స్, ఫ్ల్యూయిడ్ మెకానిక్స్, ఇంజినీరింగ్ మెటీరియల్, మిషల్ డ్రాయింగ్, మెకానిక్స్ థియరీ, ఆటోమొబైల్ సర్వీసింగ్, నిర్వహణ, పరీక్షలు, మెటారు ట్రాన్స్‌పోర్టు, ఫ్లీట్ మేనేజ్‌మెంట్ ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ సిస్టమ్, కంప్యూటర్స్, ఐటీ, ఆటోమొబైల్ టెస్టింగ్, డయాగ్నస్టిక్స్ తదితర ఆటోమొబైల్ అంశాలపై ప్రశ్నలు వస్తాయి.
ఫింగర్‌ప్రింట్ బ్యూరో (పేపర్-3): కంప్యూటర్ హార్డ్‌వేర్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, ఎంఎస్ ఆఫీస్, నెట్‌వర్కింగ్ అండ్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్.
నోటిఫికేషన్ నం.41
కానిస్టేబుల్ పోస్టులు (సివిల్, ఏఆర్, ఎస్‌ఏఆర్ సీపీఎల్, టీఎస్‌ఎస్పీ, స్పెషల్ పోలీసు, అగ్ని మాపక, వార్డర్ స్త్రీ, పురుషులు)
ప్రిలిమినరీ పరీక్ష: ఇందులో 200 ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్, అరిథ్‌మెటిక్, జనరల్‌సైన్స్, భారతదేశ చరిత్ర- సంస్కృతి - జాతీయ ఉద్యమం, భారతదేశ భౌగోళిక స్వరూపం, పాలిటీ, ఎకానమీ, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు, రీజినింగ్/మెంటల్ ఎబిలిటీ, తెలంగాణ రాష్ట్ర అంశాలపై ప్రశ్నలు ఇంటర్మీడియట్ స్థాయిలో వస్తాయి.
తుదిరాత పరీక్ష: ప్రిలిమినరీ, ఫిజికల్ ఫిట్‌నెస్‌లో అర్హత పొందినవారికి దీన్ని నిర్వహిస్తారు. తుది రాతపరీక్షలో 200 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రిలిమినరీ సిలబస్‌తో పాటు అదనంగా వ్యక్తిత్వ పరీక్ష ఉంటుంది. ఇందులో విలువలు, సున్నితత్వం, బలహీన వర్గాలు, సామాజిక అవగాహన, భావోద్వేగ తెలివితేటలపై ప్రశ్నలు అడుగుతారు.
నోటిఫికేషన్ నం.42
ఎస్సై (సివిల్, ఏఆర్, ఎస్‌ఏఆర్ సీపీఎల్, టీఎస్‌ఎస్పీ, ఎస్‌పీఎఫ్, అగ్నిమాపక, డిప్యూటీ జైలర్)
ప్రిలిమినరీ పరీక్ష: ఎస్సై ఉద్యోగాలకు ప్రిలిమినరీ పరీక్షలో 200 ప్రశ్నలు.. 200 మార్కులకు ఉంటాయి. ఈ పరీక్షలో అరిథ్‌మెటిక్ రీజినింగ్ / మెంటల్ ఎబిలిటీపై 100 ప్రశ్నలు, జనరల్ స్టడీస్‌పై 100 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ స్టడీస్‌లో జనరల్ సైన్స్, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు, దేశ చరిత్ర, జాతీయ ఉద్యమం, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ అంశాలు, దేశ భౌగోళిక స్వరూపం, జాతీయ ఆర్థిక, రాజకీయ వ్యవస్థ, గ్రామీణాభివృద్ధి, ప్రణాళిక - ఆర్థిక సంస్కరణలు, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు అంశాలపై ప్రశ్నలు వస్తాయి.
తుది రాతపరీక్ష: తుది రాత పరీక్షలో నాలుగు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో ఇంగ్లిష్ సబ్జెక్టుపై వంద మార్కులకు ఆబ్జెక్టివ్ (50 ప్రశ్నలు 25 మార్కులు), డిస్క్రిప్టివ్ (75 మార్కులు) ప్రశ్నలు ఉంటాయి. పదోతరగతి స్థాయి సిలబస్‌పై అడుగుతారు. డిస్క్రిప్టివ్‌లో లేఖలు రాయడం, నివేదికలు, వ్యాసరూప, పేరాగ్రాఫ్‌లో విషయపరిజ్ఞానం, ఆంగ్ల పఠనం, అవగాహనపై ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
పేపర్-2లో తెలుగు/ఉర్దూ భాషా పరిజ్ఞానంపై ప్రశ్నలు ఉంటాయి.
పేపర్-3లో 200 ప్రశ్నలు అరిథ్‌మెటిక్, రీజినింగ్, మెంటల్ ఎబిలిటీల్లో వస్తాయి.
పేపర్-4 జీఎస్‌లో.. జనరల్ సైన్స్, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు, దేశ చరిత్ర, జాతీయ ఉద్యమం, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ అంశాలు, దేశ భౌగోళిక స్వరూపం, జాతీయ ఆర్థిక, రాజకీయ వ్యవస్థ, గ్రామీణాభివృద్ధి, ప్రణాళిక-ఆర్థిక సంస్కరణలు, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు అంశాలతో పాటు వ్యక్తిత్వంపై ప్రశ్నలు వస్తాయి. వ్యక్తిత్వ పరీక్షలో విలువలు, సున్నితత్వం, బలహీన వర్గాలు, సామాజిక అవగాహన, భావోద్వేగ తెలివితేటలు తదితర అంశాలుంటాయి.
ఇవీ చదవండి :