రాష్ట్రంలో ఇప్పటివరకు 45 వేల మందికిపైగా రైతులకు రైతు బీమా పథకం అమలు చేసినట్లు శాసనమండలిలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. కేవలం ఐదారు రోజుల్లోనే ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు తెలిపారు.
రైతు బీమా పథకాన్ని... రైతు కూలీలకూ వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని మండలి సభ్యులు జీవన్‌రెడ్డి కోరారు. నిరుపేద కూలీలకు ప్రభుత్వం నుంచి అండగా నిలవాలని కడియం శ్రీహరి విజ్ఞప్తి చేశారు. సాగు కూలీలకూ బీమా పథకాన్ని వర్తింపజేయడం విధానపరమైన అంశమన్న మంత్రి నిరంజన్‌రెడ్డి... త్వరలోనే దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
- ఇదీ చదవండి : 'ఈ ఏడాదిలోనే కర్నెతండా ఎత్తిపోతల పథకం పూర్తి'