ETV Bharat / city

Governor congrats Kaushik: 'కౌశిక్.. కంగ్రాట్యూలేషన్స్'

రైతులపై కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా ఇందిరాపార్కులో మహాధర్నా(TRS Maha dharna 2021) చేసిన తెరాస నేతలు ధర్నా అనంతరం రాజ్​భవన్​లో గవర్నర్(telangana governor tamilisai)​ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ క్రమంలో పాడి కౌశిక్ రెడ్డి(padi kaushik reddy) గవర్నర్​ను కలిసి తనను పరిచయం చేసుకోగా.. తమిళిసై 'కంగ్రాట్యులేషన్స్' అంటూ అభినందనలు తెలిపారు. ఈ దృశ్యం చూసిన తెరాస నేతలు ఆ ప్రాంగణంలో నవ్వులు పూయించారు.

Telangana Governor
Telangana Governor
author img

By

Published : Nov 19, 2021, 11:41 AM IST

పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik reddy).. ఇటీవలి కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో వార్తల్లో నిలిచిన వ్యక్తి. ఈటల రాజేందర్(huzurabad MLA etela rajender) మంత్రివర్గం నుంచి బర్తరఫ్, ఆ తర్వాత శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడంతో కౌశిక్(padi Kaushik Reddy) సంబంధిత రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఆయన అధికార తెరాసలో చేరి గులాబీ కండువా కప్పుకోవడం.. ఆ తర్వాత గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ మంత్రివర్గం తీర్మానం చేయడం చకచకా జరిగిపోయింది. అయితే ఆ తర్వాత అసలు కథ అడ్డం తిరిగింది.

కేబినెట్ తీర్మానం చేసి పంపినప్పటికీ గవర్నర్(telangana governor tamilisai) కౌశిక్​ను పెద్దలసభకు పంపే విషయంలో నిర్ణయం తీసుకోలేదు. ఇవాళ, రేపు అంటూ రోజులు గడుస్తూ వచ్చాయి. దీనికి సంబంధించి భిన్నమైన వాదనలు వినిపించాయి. రాజ్​భవన్​లో జరిగిన మీడియా సమావేశంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నుంచే నేరుగా ఈ విషయమై స్పష్టత వచ్చింది.

సామాజిక సేవ కేటగిరిలో కౌశిక్ రెడ్డి(padi Kaushik Reddy)ని నామినేట్ చేస్తూ సిఫార్సు చేసినందున మరింతగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని, అందుకు కొంత సమయం పడుతుందని గవర్నర్ స్పష్టం చేశారు. ఆ తర్వాత ఎలాంటి కదలికా లేదు. హుజూరాబాద్ ఉపఎన్నిక(Huzurabad by election 2021) పూర్తి కావడంతో పాటు శాసనసభ కోటాలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. నామినేటెడ్ ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) సభ్యత్వానికి గవర్నర్ ఆమోదముద్ర వేయకపోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్.. అసెంబ్లీ కోటా నుంచి ఆయన పేరు ఖరారు చేశారు. నామినేషన్ దాఖలు చేశారు. నాలుగు రోజుల్లో ఎన్నికను ఏకగ్రీవంగా ప్రకటించారు.

ధాన్యం కొనుగోళ్ల అంశంపై ఇందిరాపార్క్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరిగిన మహాధర్నా(TRS maha dharna at Indira park) అనంతరం తెరాస బృందం రాజ్​భవన్​లో గవర్నర్​(telangana governor tamilisai)ను కలిసి వినతిపత్రం అందించింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కౌశిక్ రెడ్డి కూడా ఆ బృందంలో రాజ్​భవన్​కు వచ్చారు. వినతిపత్రం అందించాక నేతలందరూ అక్కడే గవర్నర్​ను విడిగా కలిశారు. ఆ సమయంలో కౌశిక్ కూడా దగ్గరకు వెళ్లి తమిళిసైకి నమస్కరించి పరిచయం చేసుకున్నారు. గవర్నర్ వెంటనే కౌశిక్​కు కంగ్రాట్యులేషన్స్ చెప్పారు. ఈ పరిణామం అక్కడున్న నేతల్లో ఆసక్తిని రేకెత్తించింది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.