ETV Bharat / city

Ts Cabinet: రిజిస్ట్రేషన్ రుసుమును ఏడున్నర శాతానికి పెంచుతూ నిర్ణయం - తెలంగాణ తాజా వార్తలు

భూములు, ఆస్తుల విలువతో పాటు రిజిస్ట్రేషన్ రుసుము పెంచాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. స్లాబుల వారీగా విలువలు పెంచడం సహా రిజిస్ట్రేషన్ రుసుమును ఏడున్నర శాతానికి పెంచుతూ ఆమోదముద్ర వేసినట్లు తెలిసింది. కొవిడ్ పరిస్థితిని సమీక్షించిన కేబినెట్... మూడో వేవ్ ముప్పు నేపథ్యంలో అవసరమైన ఔషధాలు, సౌకర్యాలు సిద్ధంగా ఉంచుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించింది. కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం చేపట్టిన అక్రమ ప్రాజెక్టులు సహా పలు అంశాలపై ఈ సందర్భంగా విస్తృతంగా చర్చించారు. దీనిపైనా బుధవారం మరోసారి చర్చించనున్నారు.

Telangana Cabinet Decisions
Telangana Cabinet Decisions
author img

By

Published : Jul 14, 2021, 4:04 AM IST

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి ఏడు గంటలకు పైగా చర్చించి పలు అంశాలపై నిర్ణయాలు తీసుకుంది. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి పురోగతిపై కేబినెట్​లో చర్చించారు. పల్లె, పట్టణప్రగతి అమలు తీరుతెన్నులు, పనుల పురోగతిపై పంచాయతీరాజ్, పురపాలకశాఖలు మంత్రివర్గానికి నివేదికలు సమర్పించాయి. రానున్న నెల రోజుల్లోపు రాష్ట్రంలో అన్ని వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తి చేయాలని మంత్రులు, అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇకమీద అన్ని గ్రామ పంచాయతీల్లో వీధిదీపాల కొరకు విధిగా మూడో వైర్ ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖకు కేసీఆర్ స్పష్టం చేశారు.

చుక్క నీటినీ వదలం..

కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా నుంచి ఒక్క చుక్క కూడా బయటికి పోనీయం. దీనిపై అన్ని వేదికల మీద బలమైనవాణిని వినిపిస్తున్నాం. చట్టబద్ధంగా, న్యాయపరంగా పోరాడుతున్నాం. రాబోయే పార్లమెంటు సమావేశాల సందర్భంగా కూడా ఈ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. - ముఖ్యమంత్రి కేసీఆర్‌.

మహానగర మంచినీటి సమస్య..

పురపాలికల అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై కేబినెట్ చర్చించింది. హైదరాబాద్ నగర శివారులోని మున్సిపాలిటీల పరిధిలో మంచినీటి సమస్య ప్రస్తావనకు వచ్చింది. సమస్యను తక్షణమే పరిష్కరించాలన్న సీఎం... ఇప్పటికే విడుదల చేసిన నిధులకు అదనంగా మరో రూ.1200 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. నీటిఎద్దడి నివారణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణాల కోసం అభివృద్ధి చేసే లేఅవుట్లలో లాండ్ పూలింగ్ విధానాన్ని అమలు చేయాలన్న అంశంపై కేబినెట్ చర్చించింది. అందుకు సంబంధించిన అవకాశాలు అన్వేషించాలని, విధివిధానాలపై దృష్టిసారించాలని, పురపాలకశాఖ అధికారులను మంత్రివర్గం ఆదేశించింది.

గురుకులాల్లో స్థానిక రిజర్వేషన్లు

ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో స్థానిక రిజర్వేషన్లు అమలు చేయాలని... ఆయా నియోజకవర్గాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులకు 50 శాతం సీట్లు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వ గురుకుల విద్యాసంస్థల్లో ప్రతి నెలా జరిగే సమావేశాలకు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీపీ, జెడ్పీ ఛైర్మన్, మున్సిపల్ ఛైర్మన్​లను విధిగా ఆహ్వానించాలని అధికారులను ఆదేశించింది.

మూడోవేవ్​కు సన్నద్ధత..

రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై మంత్రివర్గం చర్చించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏడు జిల్లాలలో పర్యటించి వచ్చిన ఆరోగ్యశాఖ కార్యదర్శి, అధికారులు... ఆయా జిల్లాల్లో నెలకొన్న కొవిడ్ పరిస్థితి, తీసుకున్న చర్యలు, నివారణకై ఇచ్చిన సూచనలు, తదితర క్షేత్రస్థాయి పరిశీలనలను, కేబినెట్​కు వివరించారు. ఔషధాలు,, ఆక్సిజన్ లభ్యత, ఇతర మౌలిక వసతులు, సౌకర్యాలపై సమావేశంలో పూర్తిస్థాయిలో చర్చించారు. వ్యాక్సినేషన్, పడకల లభ్యత, ఔషదాల అందుబాటు సహా మూడో వేవ్​కు సన్నద్ధత గురించి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు మంత్రివర్గానికి వివరించారు. కరోనా నియంత్రణకు సంబంధించి వైద్య, ఆరోగ్యశాఖకు ఇప్పటికే అన్ని రకాల అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ఔషధాలు అందుబాటులో ఉంచడం, జ్వరసర్వే సహా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలని కేబినెట్ ఆదేశించింది.

భూములు విలువ పెంపు..

భూములు, ఆస్తుల విలువల సవరణ, రిజిస్ట్రేషన్ రుసుము పెంపుపై సమావేశంలో చర్చించారు. నిధుల సమీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులకు అనుగుణంగా విలువలు పెంచేందుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువలను స్లాబుల వారీగా పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రిజిస్ట్రేషన్ రుసుమును కూడా ఆరు శాతం నుంచి పొరుగు రాష్ట్రాలతో పాటు ఏడున్నర శాతానికి పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఇవీ చూడండి: వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువ పెంపునకు రంగం సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.