తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశ మందిరానికి చేరుకున్న గవర్నర్ను స్పీకర్ పోచారం, సీఎం కేసీఆర్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఘనంగా స్వాగతించారు. ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు.
సభాపతి, మండలి చైర్మన్ అధ్యక్షతన సమావేశమైన బీఏసీ భేటీ ముగిసింది. ఈ భేటీలో బడ్జెట్ సమావేశాల అజెండాను బీఏసీ ఖరారు చేసింది. సమావేశాలను 2 వారాలపాటు నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయించింది. మంగళవారం రోజు ఉభయసభల్లోనూ... నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల నర్సింహయ్య మరణంపై సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు.
ఈ నెల 18న ఉదయం 11.30 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. 20 నుంచి బడ్జెట్, పద్దులు, ఇతర అంశాలపై చర్చించనున్నారు.