రాష్ట్రంలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా మరిన్ని గోదాముల నిర్మాణానికి కేంద్రం సహకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ బోర్డు సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సాగు నీటి ప్రాజెక్టుల రాకతో పంటల దిగుబడి పెరుగుతున్నందున... గోదాం నిర్మాణాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రైతుల పంటలు గోదాంలలో నిల్వ చేసుకుంటే... మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకునే వీలుంటుందన్నారు.
వెయ్యి కోట్ల నాబార్డు నిధులతో 336 ఆధునిక గోదాములు నిర్మించినట్లు మంత్రి తెలిపారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా పథకం, సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణంతో... సాగు విస్తీర్ణం సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. రానున్న రోజుల్లో పంటల దిగుబడి మరింత పెరగనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి. పార్ధసారధి, టీఎస్ గిడ్డంగుల సంస్థ ఎండీ భాస్కరాచారి, కేంద్ర గిడ్డంగుల సంస్థ జీఎం ఆర్ఆర్ అగర్వాల్, ప్రాంతీయ మేనేజర్ ప్రవీణ్ కుమార్, డైరెక్టర్ ముత్తురామన్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'పౌరసత్వ చట్ట సవరణ అమలుపై వెనక్కి తగ్గేది లేదు'