ETV Bharat / city

శాసనమండలి సమావేశాలను ప్రత్యక్ష ప్రసారమివ్వాలి: యనమల - telangana news

Yanamala letter to legislative council chairman: ఏపీ శాసనమండలి సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ఇవ్వాలని.. తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ మేరకు మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజుకు ఆయన లేఖ రాశారు. మండలి సభ్యులకు తగినంత భద్రత కల్పించాలని కోరారు.

Yanamala letter to legislative council chairman, yanamala letter
శాసనమండలి సమావేశాలను ప్రత్యక్ష ప్రసారమివ్వాలి: యనమల
author img

By

Published : Mar 6, 2022, 3:36 PM IST

Yanamala letter to legislative council chairman: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ఇవ్వాలని.. మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజుకు.. తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. ఎలాంటి ఎడిటింగ్ లేకుండా అన్ని పార్టీల వాదన ప్రజలు వీక్షించేలా చర్యలు చేపట్టాలని కోరారు. మండలి సభ్యులకు తగినంత భద్రత కల్పించాలని స్పష్టం చేశారు. శాసనసభతో సంబంధం లేకుండా మండలి సభ్యులకు ప్రత్యేక మీడియా పాయింట్ ఏర్పాటు చేయాలని కోరారు.

Yanamala letter to legislative council chairman, yanamala letter
మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజుకు యనమల లేఖ

Legislative Speaker Tammineni Sitaram: సభలో సభ్యులు అడిగే ప్రతీ ప్రశ్నకూ సమాధానాలు పంపడం ద్వారా వారి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ శాఖల అధికారులపై ఉందని శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేను రాజు, శాసనసభాపతి తమ్మినేని సీతారాం ఇటీవలె స్పష్టం చేశారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో శనివారం అసెంబ్లీ కమిటీహాలులో వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో వేర్వేరుగా వారిరువురూ సమావేశం నిర్వహించారు.

సత్సంప్రదాయాన్ని కొనసాగించాలి..

సభ్యులకు సకాలంలో సమాధానాలు ఇచ్చే సత్సంప్రదాయాన్ని అధికారులు కొనసాగించాలని ఏపీ శాసనమండలి ఛైర్మన్‌ మోషేను రాజు చెప్పారు. గత సమావేశాల్లో మండలి సభ్యుల ప్రశ్నలకు పాఠశాల విద్య, ఆర్థికశాఖల నుంచి రావాల్సిన సమాధానాలు ఎక్కువగా పెండింగులో ఉన్నాయన్నారు. గతంలో అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానాలను ఈ సమావేశాలు పూర్తయ్యేలోపు పంపాలని అధికారులను ఆదేశించారు. ప్రశాంత వాతావరణంలో సమావేశాలు కొనసాగేలా పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని డీజీపీ రాజేంద్రనాథరెడ్డిని ఛైర్మన్‌ ఆదేశించారు. సభ్యులు బసచేసే ప్రాంతాల్లో, వారు సమావేశాలకు హాజరయ్యేందుకు అసెంబ్లీకి వచ్చేంతవరకు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీల వైద్యబిల్లుల చెల్లింపుపై ఆర్థికశాఖ ప్రత్యేకదృష్టి సారించాలని సూచించారు.

ఇదీ చదవండి: సీఎల్పీ భేటీని బహిష్కరించిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. సీతక్క కూడా మధ్యలోనే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.