కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తోంది. లాక్డౌన్ కారణంగా అనేక వ్యాపారాలు మూతపడ్డాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకు వసతుల లేమి.. కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోంది. అరకొర సదుపాయాలతో మారుమూల గ్రామాల్లోని విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల్లో ఉన్న మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్ర సమీపంలోని ఓనకడిల్లి విద్యార్థులు ఆన్లైన్ క్లాసులకు హాజరుకావడానికి ప్రతిరోజూ 5 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది.
అంత దూరం ప్రయాణించి.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జియో సిగ్నల్‌పై ఆధారపడుతున్నారు. ఓనకడిల్లి, మాచ్ఖండ్లలో బీఎస్ఎన్ఎల్ సేవలు ఉన్నప్పటికి అంతర్జాలంలో వేగం లేక నడిరోడ్డుపైనే విద్యార్థులు పాఠాలు వినాల్సివస్తుంది. మాచ్‌ఖండ్, ఓనకడిల్లి తదితర గ్రామాలకు చెందిన విద్యార్ధులు విశాఖపట్నం, భువనేశ్వర్, కొరపుట్, జయపురం పట్టణాల్లో ఉన్నత విద్య చదివారు. లాక్డౌన్ కారణంగా వారంతా .. స్వస్థలానికి వెళ్లారు. ఇప్పుడు ఆన్ లైన్ క్లాసుల కోసం ఇలా కష్టాలు పడుతున్నారు.
ఇదీ చదవండి: ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించేందుకు సర్కారు కసరత్తు