దిశ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్(Disha accused encounter case)పై సిర్పూర్కర్ కమిషన్(sirpurkar commission) విచారణ కొనసాగుతోంది. నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ హెచ్ఓడీ కృపాల్ సింగ్‌ను కమిషన్ ప్రశ్నిస్తోంది. గురువారం రోజు కృపాల్‌ను విచారించడం మొదలుపెట్టి.. నేడూ కొనసాగిస్తోంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ నియమావళిని పాటించారా లేదా అని అడిగింది. ఎన్ కౌంటర్‌కు సంబంధించిన సమాచారం మీకెవరిచ్చారు...? సంఘటనా స్థలానికి ఎన్ని గంటలకు చేరుకున్నారు? జాతీయ మానవ హక్కుల కమిషన్(sirpurkar commission) నిబంధనల ప్రకారమే పోస్టుమార్టం నిర్వహించారా? అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు పోలీస్ వాహన డ్రైవర్ యాదగిరిని దాదాపు 3 గంటల పాటు కమిషన్ విచారించింది.
బుల్లెట్లు ఎంత దూరం దూసుకొచ్చాయ్..
పోస్టుమార్టంకు సంబంధించి దిల్లీ ఎయిమ్స్ వైద్యుడు సుధీర్‌ను విచారించింది. బుల్లెట్ గాయల వల్ల నలుగురు చనిపోయినట్లు పోస్టుమార్టంలో తేలిందని సుధీర్ కమిషన్(sirpurkar commission)కు తెలిపారు. దిశ నిందితుల ఎన్కౌంటర్(Disha accused encounter case)లో ( Disha Encounter Case News) బుల్లెట్లు ఎంత దూరం దూసుకొచ్చాయని.. మృతుల శరీరంలో బుల్లెట్లు వెనక నుంచి దిగాయా లేక ముందు వైపు నుంచి లొపలకి దూసుకెళ్లాయా? అని దిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం హెచ్ఓడీ డాక్టర్ సుధీర్ గుప్తాను సిర్పూర్కర్ కమిషన్ ప్రశ్నించింది. బాలిస్టిక్ రిపోర్టు సమయానికి అందక పోవడం వల్ల ఆ వివరాలు చెప్పలేనని సుధీర్ గుప్తా.. కమిషన్‌కు(sirpurkar commission) సమాధానం ఇచ్చారు.
వాళ్ల వాంగ్మూలం ఏది?
మరోవైపు.. జాతీయ మానవ హక్కుల కమిషన్(sirpurkar commission) ఏర్పాటు చేసిన బృందాన్ని కమిషన్ విచారిస్తోంది. ఇప్పటికే ఎన్కౌంటర్(Disha accused encounter case)కు సంబంధించిన పలు విషయాలను వాళ్ల నుంచి సేకరించిన కమిషన్.. అఫిడవిట్‌లోని అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఎన్కౌంటర్ జరిగిన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించకపోవడం, నిందితుల ఎదురు కాల్పుల్లో గాయపడ్డ ఇద్దరు కానిస్టేబుళ్ల నుంచి వాంగ్మూలం సేకరించకపోవడంపై ఎన్హెచ్ఆర్సీ బృందంపై సిర్పూర్కర్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ నియమావళి ప్రకారం సేకరించిన వివరాల గురించి కమిషన్ సభ్యులు అడిగారు.
నెక్స్ట్ సజ్జనారే
ఘటన జరిగినప్పుడు సైబరాబాద్ సీపీగా ఉన్న సజ్జనార్ శుక్రవారం రోజున కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంది. కానీ ఎన్హెచ్ఆర్సీ బృందం విచారణ పూర్తి కాకపోవడం వల్ల సజ్జనార్‌ను మరో రోజు విచారించే అవకాశం ఉంది.