ETV Bharat / city

షోలాపూర్ చెప్పులు... టెర్రకోట బొమ్మలు.. పంజాబీ పచ్చళ్లు

author img

By

Published : Dec 5, 2019, 5:14 PM IST

మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఏర్పాటు చేసిన స్వయం సహాయక బృందాలు తయారు చేసిన ఉత్పత్తులకు దేశవ్యాప్త డిమాండ్​ ఉంది. ఎస్​హెచ్​జీ మేళా ఐదు రోజుల పాటు నగర ప్రజలకు వారి ఉత్పత్తులను పరిచయం చేసింది. అటవీ ఉత్పత్తుల నుంచి మొదలుకొంటే... ఉత్తరాది వస్త్రాలు, మట్టిపాత్రలు, వెదురు బుట్టలు కనువిందు చేశాయి.

షోలాపూర్ చెప్పులు... టెర్రకోట బొమ్మలు.. పంజాబీ పచ్చళ్లు
షోలాపూర్ చెప్పులు... టెర్రకోట బొమ్మలు.. పంజాబీ పచ్చళ్లు

మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు, సొంతంగా రాణించి మహిళా సాధికారతను చాటేందుకు స్వయంసహాయక బృందాలు దోహదపడుతున్నాయి. కొంతమంది మహిళలు గ్రూపుగా చేరి ప్రభుత్వాల నుంచి పొందే పెట్టుబడి సాయం వారి జీవితాలకు భరోసాతో పాటు.. వారు చేసే చిరు వ్యాపారానికి బాసటగా నిలుస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఈ బృందాలు తమ నెట్ వర్క్ బలాన్ని చాటుతూ అన్ని రాష్ట్రాల్లో మేళాలు, ప్రదర్శనలు నిర్వహిస్తూ.. తమ ఉత్పత్తులను మార్కెట్ చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఎస్​హెచ్​జీ మేళా హైదరాబాద్​కి చేరింది.

పలు రాష్ట్రాల నుంచి గ్రామీణ, అటవీ ఆధారిత ఉత్పత్తులను ఇక్కడ లభిస్తున్నాయి. వెదురు బుట్టలు, టెర్రాకోట్ ఆభరణాలు, మట్టి పాత్రలు, షోలాపూర్ పాదరక్షలు, ఉత్తరాది వస్త్రాలు, పంజాబీ పచ్చళ్లు, అటవీ తేనె ఇలా అనేక రకాల గ్రామీణ, అటవీ ఆధారిత ఉత్పత్తులు ఇక్కడ కొలువుదీరాయి. ఏటా నిర్వహించే ఈ మేళాకు సందర్శకుల తాకిడి పెరుగుతోందని నిర్వాహకులు చెబుతున్నారు. అందుకే ఎంతో ఉత్సాహంగా ఈ మేళాలో పాల్గొంటామని.. హైదరాబాద్ తో పాటు..దేశవ్యాప్తంగా జరిగే జాతరల్లో తమ స్టాళ్లు ఏర్పాటు చేసి ఉత్పత్తుల విక్రయాలు జరుపుతామని ఎస్​హెచ్​జీ గ్రూపు సభ్యులు పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రజల ఆదరణ, ఇక్కడ వాతావరణం బాగుంటుందని.. తమ వస్తువులకు ఇక్కడ చక్కని గిరాకీ లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:అమెరికా నౌకాశ్రయంలో కాల్పులు- రాకేశ్ బృందం సురక్షితం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.