ఏపీలోని కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం పడమర ప్రాతకోటలో 10 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న ఆరుగురు పిల్లలపై ముచ్చుమర్రి పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. ప్రాతకోటలో ఓవర్‌హెడ్ ట్యాంకులో ఆరుగురు చిన్నారులు మూత్రం పోస్తుండగా సురేఖ, రమణ దంపతులు అడ్డుకున్నారు. వారిలో ముగ్గురిని పట్టుకున్నారు. ముగ్గురు పారిపోయారు. దొరికినవారిని ప్రశ్నించగా కొందరు గ్రామస్థుల సూచనలతోనే ఇలా చేసినట్లు పిల్లలు చెప్పారు.
దంపతుల ఫిర్యాదు మేరకు పిల్లలతోపాటు ప్రోత్సహించిన వారందరిపై ఎస్సీఎస్టీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. వారం క్రితం ప్రాతకోటలో ఎమ్మెల్యే ఆర్థర్ అనుచరులు చిన్నారులపై దాడి చేశారు. ఈ ఘటన వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలోనే చిన్నారులపై కేసు నమోదైనట్లు సమాచారం.
ఇదీ చదవండి: రాజధాని భూ కొనుగోలు దర్యాప్తుపై హైకోర్టు స్టే యథాతథం: సుప్రీం