ETV Bharat / city

సాలరే మిల్లత్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా ప్రజలను ఆదుకుంటాం: అక్బరుద్దీన్ - సాలరే మిల్లత్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఛైర్మన్ అక్బరుద్దీన్ ఓవైసీ

వరదల కారణంగా నష్టపోయిన ప్రజల కోసం సాలరే మిల్లత్ ఎడ్యుకేషన్​ ట్రస్ట్​ భారీ సాయాన్ని ప్రకటించింది. నిత్యావసర సరకులతోపాటు 33వస్తువులతో ఓ కిట్​ తయారు చేసి ప్రజలకు అందించనున్నారు. ఆర్థికంగా కూడా ఆదుకోనున్నట్టు ట్రస్ట్​ ఛైర్మన్​, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తెలిపారు.

salare millath education trust continues services for flood victims in hyderabad
సాలరే మిల్లత్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా ప్రజలను ఆదుకుంటాం: అక్బరుద్దీన్
author img

By

Published : Oct 24, 2020, 10:10 AM IST

హైదరాబాద్​లో ఇటీవల వచ్చిన వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టానికి ప్రజలకు అండగా ఉండేందుకు సాలరే మిల్లత్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కోటిన్నర రూపాయల సాయం అందించింది. నీటిలో కొట్టుకుపోయిన, దెబ్బతిన్న ఓలా, ఉబెర్ కార్లు, ఆటోల మరమ్మతుల కోసం ఒక్కొక్కరికి రూ.15 నుంచి రూ.20 వేలు, ద్వికచక్రవాహనదారులకు రూ.4 నుంచి రూ.5 వేల సాయం అందిస్తున్నట్టు చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే, ట్రస్ట్ ఛైర్మన్ అక్బరుద్దీన్ ఓవైసీ వెల్లడించారు.

పిల్లల పెళ్లిల కోసం సమకూర్చుకున్న వస్తువులు పోగొట్టుకున్న 50 కుటుంబాలకు రూ.50 చొప్పున ఆర్థికసాయం అందించనున్నారు. చిన్నచిన్న దుకాణాలను కూడా ఆర్థికంగా ఆదుకుంటామన్నారు. నిత్యావసర సరకులతో కలిపి 33 వస్తువుల కిట్​ను బాధితులందరికిీ పంపిణీ చేయనున్నారు. ఇప్పటి వరకు 6వేల వరద బాధితులకు పాలు, బ్రెడ్, నీరు, భోజనాల కోసం ట్రస్ట్ నుంచి రూ.18 లక్షలు ఖర్చు చేసినట్టు అక్బరుద్దీన్ వెల్లడించారు. ఈ సేవలు కొనసాగించనున్నట్టు తెలిపారు.

చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో వరద నీరు చేరి 27 మసీదుల్లో పాడైన వాటి చోట కొత్త జనిమాజ్​లు ఇస్తున్నామని అక్బరుద్దీన్ తెలిపారు. ఓవైసీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాామని, సాలరే మిల్లత్ ట్రస్ట్​ ద్వారా రూ.10 లక్షల విలువైన మందులు ఉచితంగాా అందించినట్టు వెల్లడించారు. వరద కారణంగా పాడైన... ఫ్రిడ్జ్​లు, వాషింగ్ మెషీన్​లు, గ్యాస్​ పొయ్యిల మరమ్మతుల కోసం బృందాన్ని తయారు చేసినట్టు పేర్కొన్నారు. ప్రజలను ఆదుకుంటున్న సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​, ప్రభుత్వం నుంచి సాయం అందించిన హైదరాబాద్​ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి... ఈ సందర్బంగా కృతజ్ఞలు తెలిపారు.

ఇదీ చూడండి: దసరా ముందే రూ.10వేల ఆర్థికసాయం అందేలా చూడాలి: కేసీఆర్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.