రైతుల ఖాతాల్లో తొలి రోజు రైతుబంధు 516.95 కోట్ల రూపాయలు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది. అర్హులైన 16.95 లక్షల మందికి లబ్ధి చేకూరినట్లు తెలిపింది. రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో అత్యధికంగా లక్షా 11వేల 970 మంది రైతులకు 36.10 కోట్లు, ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 9వేల 628 మందికి 35.60 లక్షల రూపాయలు జమ చేసినట్లు వ్యవసాయశాఖ ప్రకటించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఎకరా వరకు ఉన్న 16 లక్షల 95 వేల 601 మంది అన్నదాతల అకౌంట్లలో నిధులు పంపించారు. రెండో రోజు రెండు ఎకరాల వరకు ఉన్న 15.07 లక్షల మంది ఖాతాల్లోకి 1152.46 కోట్లు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అత్యధికంగా నల్గొండలో లక్షా 10 వేల 407 మంది రైతుల ఖాతాల్లో 85.23 కోట్లు వేయనున్నట్లు పేర్కొంది.