ETV Bharat / city

RRR: సినిమా టికెట్ల ధర తగ్గింపుపై 'ఆర్‌ఆర్‌ఆర్‌' అసంతృప్తి.. అసలేంటీ వివాదం? - తెలంగాణ వార్తలు

RRR
RRR
author img

By

Published : Nov 14, 2021, 10:41 AM IST

Updated : Nov 14, 2021, 12:40 PM IST

10:38 November 14

ఏపీలో సినిమా టికెట్ల ధర తగ్గింపుపై 'ఆర్‌ఆర్‌ఆర్‌' నిర్మాత అసంతృప్తి

  • It is true that the slashing of ticket prices will affect our film immensely. But we at #RRRMovie have no intention of going to court. We are trying to approach the honourable Andhra Pradesh CM garu and explain our situation for an amicable solution.

    — DVV Entertainment (@DVVMovies) November 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్‌ ధరల తగ్గింపు(Ap Cinema Ticket Issue) వ్యవహారంపై ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) నిర్మాత డీవీవీ దానయ్య (DVV Danayya) అసంతృప్తి వ్యక్తం చేశారు. ధరల తగ్గింపు(Ap Cinema Ticket Issue) ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని.. దీంతో ఆ చిత్ర బృందం త్వరలో కోర్టు మెట్లు ఎక్కనుందంటూ గత కొన్ని రోజుల నుంచి వరుస కథనాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై తాజాగా డీవీవీ దానయ్య స్పందించారు.

ఏపీలో సినిమా టికెట్ ధరలపై ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం.. 'ఆర్ఆర్ఆర్'పై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే.. ఈ విషయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారన్న ప్రచారంలో మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. టికెట్ ధరల తగ్గింపు వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని సంప్రదిస్తామని తెలిపారు. సమస్యను ఏపీ ముఖ్యమంత్రికి వివరించి... సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు కృషి చేస్తామని దానయ్య పేర్కొన్నారు.  

టిక్కెట్ ధరల తగ్గింపుతో మా సినిమాపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాకు సంబంధించి కోర్టుకు వెళ్లే ఉద్దేశం లేదు. ఏపీ సీఎంను సంప్రదించి సమస్య వివరించేందుకు ప్రయత్నిస్తాం. టికెట్ ధరల సమస్య సామరస్యంగా పరిష్కరించుకుంటాం. 

-డి.వి.వి. దానయ్య, ఆర్​ఆర్ఆర్ చిత్ర నిర్మాత

దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన యాక్షన్‌, ఎమోషనల్‌ డ్రామా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. రామ్‌చరణ్‌-తారక్‌ (RamCharan), (Tarak) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. ఆలియాభట్‌ (Aliabhatt), ఒలీవియా మోరీస్‌ కథానాయికలు. శ్రియ, సముద్రఖని, అజయ్‌ దేవ్‌గణ్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

అసలు ఏంటీ వివాదం?

ఆన్‌లైన్ ద్వారా సినిమా టికెట్లు (Online Movie Tickets) విక్రయించాలని ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం (Andhra Pradesh Government) ఇదివరకే నిర్ణయించింది. దీనిపై అధ్యయానికి ఉన్నతాధికారులతో కమిటీ నియమించింది. టికెట్ల విక్రయంపై (Online Movie Tickets) ఏపీ ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదం కావటంతో సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు, నిర్మాతలు, థియేటర్ యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపారు.  

పేర్ని నాని కామెంట్స్

సెప్టెంబర్ 20న తలపెట్టిన సమావేశానికి సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులను ఆహ్వానించింది. ఆన్‌లైన్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో టిక్కెట్లు అమ్మడంపై ఏపీ సమాచారశాఖ మంత్రి పేర్ని నాని.. థియేటర్ల యజమానులు, సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం టికెట్లు విక్రయిస్తే బాగుంటుందని సినీ పెద్దలే ప్రతిపాదించినట్లు పేర్ని నాని (Perni Nani) ఆ సమావేశం అనంతరం ప్రకటించారు. ఆన్‌లైన్ టికెట్ల విక్రయం (Online Movie Tickets)తో వచ్చే సొమ్మును రియల్ టైమ్‌లోనే థియేటర్ల యజమానులకు బదిలీ చేస్తామని అన్నారు. ఏపీ ఫిలిం, టెలివిజన్, థియేటర్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ద్వారా ఆన్ లైన్ టికెటింగ్ పోర్టల్‌ (Online ticketing portal‌) నిర్వహించనున్నట్టు వివరించనుంది.

పవన్ కామెంట్స్

ప్రైవేటు పెట్టుబడితో సినిమా తీస్తే ప్రభుత్వం పెత్తనం ఏంటి ?

​'ఆంధ్రప్రదేశ్​లో సినిమాలు ఆపేసి లక్షల మంది పొట్ట గొడుతున్నారు. పవన్‌కల్యాణ్‌ సినిమా(pawan kalyan on cinema tickets in ap)ను ఆపేసినా, అతనొచ్చిన చిత్ర పరిశ్రమని ఆపేసినా అందరూ భయపడిపోయి.. తమ దగ్గరికొస్తారని వైకాపా నాయకులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూస్తే కాలిపోతారు జాగ్రత్త' అంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఇదివరకే హెచ్చరించారు. చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన సంపదను బ్యాంకుల్లో చూపించి, అప్పులు తెచ్చుకోవాలనే సినిమా టికెట్ల(pawan on cinema tickets)పై పెత్తనం చెలాయించేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. సీనియర్‌ నటుడు మోహన్‌బాబు సహా పరిశ్రమలో ప్రతి ఒక్కరూ స్పందించి, జరుగుతున్న అన్యాయంపై గళమెత్తాలని పిలుపునిచ్చారు.   

బొత్స వ్యాఖ్యలు

సినిమా టికెట్ల విషయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్(botsa Satyanarayana comments on pawan kalyan) చేసిన వ్యాఖ్యల​పై ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(minister botsa Satyanarayana) మండిపడ్డారు. సినిమా టికెట్ల ధరలను ఇష్టానుసారంగా పెంచి ప్రజలపై భారం వేస్తుంటే ఏపీ ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా అంటూ వ్యాఖ్యానించారు. సినిమా టికెట్ల విషయం(bosta comments on cinema tickets issue )లో నియంత్రణ లేకుండాపోతోందన్నారు. జీఎస్టీ లాంటి పన్నులను స్ట్రీమ్ లైన్ చేయాలన్నదే ఏపీ ప్రభుత్వ ఉద్దేశం అన్నారు.  

'సినిమా టికెట్ల ఆన్​లైన్(online cinema tickets) అమ్మకాల విధానాన్ని సినిమా డిస్ట్రిబ్యూటర్లే అడిగారు.. వాళ్లకు లేని బాధ పవన్​కు ఎందుకని ప్రశ్నించారు. వైకాపా మంత్రులు సన్నాసులంటూ.. నోరుందని పవన్ ఇష్టానుసారంగా మాట్లాడతారా అంటూ ధ్వజమెత్తారు. సినిమా ఇండస్ట్రీ(bosta on cinema tickets)లో ఏమైనా ఇబ్బందులుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. పరిశ్రమలో పవన్ ఒక్కరే లేరు కదా.. చాలామంది ఉన్నారు. చిరంజీవి, మోహన్​బాబులాంటి పెద్దలు ప్రభుత్వంతో సంప్రదించవచ్చునని పేర్కొన్నారు. ఇది రిపబ్లిక్ ఇండియా.. మీ ఇష్టానుసారంగా ఉండటం కుదరదు' అని పవన్​ను ఉద్దేశించి అన్నారు.

కాగా ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాత అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్​ను కలుస్తామని ట్వీట్ చేశారు.    

ఇదీ చదవండి: ప్రేయసితో స్టార్​ నటుడి నిశ్చితార్థం

Last Updated : Nov 14, 2021, 12:40 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.