ETV Bharat / city

నెత్తురోడిన రహదారులు.. తొమ్మిది మంది దుర్మరణం - తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు

కొత్త ఏడాదిలో రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో రహదారులు నెత్తురోడాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతిచెందగా.. పలువురు గాయాలపాలయ్యారు.

తెలుగు రాష్ట్రాల్లో నెత్తురోడిన రహదారులు.. ఏడుగురు దుర్మరణం

author img

By

Published : Jan 2, 2021, 10:03 AM IST

Updated : Jan 2, 2021, 10:28 AM IST

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రావులపాలెం మండలం గోపాలపురం వద్ద జాతీయరహదారిపై .. కడప జిల్లా మైదుకూరు నుంచి కాకినాడ వెళ్తున్న టమాటా లోడు లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతులు గోపాలపురానికి చెందిన సతీశ్‌(21), చంటి(20), కొత్తపేట మండలం కండ్రిగకు చెందిన సురేందర్‌గా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విజయనగరం జిల్లాలో..
ఆటో, లారీ ఢీనడంతో ఇద్దరు మృతిచెందిన ఘటన ఏపీలోని విజయనగరం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట వద్ద చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఖమ్మం జిల్లాలో..
ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పొన్నెకల్‌ బుగ్గవాగు వద్ద ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారిద్దరూ మరణించారు. మహబూబాబాద్‌లో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మృతులను పండితాపురానికి చెందిన వెంకటేశ్‌(24), సాయి(23)గా గుర్తించారు.

ప్రకాశం జిల్లాలో..
ఆగి ఉన్న లారీని ట్రాలీ ఆటో ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందిన ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం మోక్షగుండం వద్ద చోటు చేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి వ్యక్తి మృతదేహాన్ని తీసుకెళుతుండగా ఈ ఘటన జరిగింది.

ఇవీ చదవండి.. ఆస్ట్రేలియాలో తెలంగాణ యువతి దుర్మరణం

Last Updated : Jan 2, 2021, 10:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.