ETV Bharat / city

ఈనెల 20 నుంచి మునుగోడులోనే ఉంటానని కార్యకర్తలకు రేవంత్ రెడ్డి భరోసా - కార్యకర్తలకు రేవంత్ భరోసా

revanth on munugodu tour మునుగోడులో సర్పంచులు, ఎంపీటీసీలను తెరాస కొనుగోలు చేస్తోందని.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కోవిడ్ వల్ల మునుగోడు వెళ్లలేకపోయినట్లు ఆయన చెప్పారు. ఈనెల 20 నుంచి మునుగోడులోనే ఉంటానని రేవంత్ రెడ్డి తెలిపారు.

revanth
revanth
author img

By

Published : Aug 15, 2022, 7:55 PM IST

Updated : Aug 15, 2022, 8:56 PM IST

revanth on munugodu tour: పార్టీ ఫిరాయింపులకు తెలంగాణను సీఎం కేసీఆర్ ప్రయోగశాలగా మార్చారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. మునుగోడులో సర్పంచ్‌లను, ఎంపీటీసీలను అధికార పార్టీ కొనుగోలు చేస్తోందని ధ్వజమెత్తారు. తాను ఇప్పటికే మునుగోడులో పర్యటించాల్సి ఉన్నా... తమకు కరోనా కారణంగా రాలేకపోయానని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 20వ తేదీ నుంచి మునుగోడులోనే తాను ఉంటానని పేర్కొన్న ఆయన కార్యకర్తలు ఎవరు పార్టీ మారొద్దని పిలుపునిచ్చారు.

ఎనిమిది సంవత్సరాలు కొట్లాడిన నాయకులు... ఒక ఏడాది ఓపిక పడితే... కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని భరోసా ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నికలు అనేవి తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు ఒక సూచికగా ఆయన అభివర్ణించారు. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీని గెలిపించడం ద్వారా ఇటు కేసీఆర్‌ అటు నరేంద్ర మోదీలకు బుద్ధి చెప్పినట్లు అవుతుందన్నారు.

మునుగోడులో సర్పంచ్​, ఎంపీటీసీలను కేసీఆర్ గారు కొనుగోలు చేయడం ద్వారా.. మరోసారి ఉప ఎన్నికలను ఆ దిశగానే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చర్యలతో కేసీఆర్ మరోసారి ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేందుకు బయలుదేరారు. ఈనెల 20 నుంచి నేను మునుగోడులో పర్యటిస్తా: రేవంత్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

ఈనెల 20 నుంచి మునుగోడులోనే ఉంటానని రేవంత్ రెడ్డి భరోసా

ఇవీ చదవండి

Last Updated : Aug 15, 2022, 8:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.