ETV Bharat / city

బోటు ప్రమాదం... ఇంకా దొరకని 35 మంది ఆచూకీ

కచ్చులూరు బోటు ప్రమాదంలో గాలింపు చర్యలకు తీవ్ర అవరోధం కలుగుతోంది. నదీ ప్రవాహ వేగం, లోతు, నీటి ఉద్ధృతి తీవ్ర అంతరాయం కల్గిస్తున్నాయి. నౌకాదళం,ఎన్డీఆర్​ఎఫ్, ఎస్​డీఆర్​ఎఫ్, రాష్ట్ర అగ్నిమాపక శాఖ, స్థానిక మత్స్యకారులు ఇంతమంది గాలిస్తున్నా ఆశించిన మేర ఫలితాలు రావడం లేదు.

author img

By

Published : Sep 17, 2019, 7:30 AM IST

బోటు ప్రమాదం...ఇంకా దొరకని ప్రయాణికుల ఆచూకీ

తూర్పుగోదావరి జిల్లాలో బోటు మునక ఘటనలో రెండు రోజులు దాటుతున్నా ఇప్పటివరకు 12 మృతదేహాలు మాత్రమే లభ్యం కావడం, గల్లంతైన వారి ఆచూకీ తెలియకపోవడం తీవ్రంగా కలవరపరుస్తోంది. రాయల వశిష్ఠ బోటు మునిగిన కచ్చులూరు ప్రాంతం వద్ద 300 మీటర్ల లోతున నది ఉండటం, అదే ప్రాంతంలో తీవ్ర ఉద్ధృతితో నీటి ప్రవాహ వేగం ఉండటం గాలింపు చర్యలకు తీవ్ర విఘాతాన్ని కల్గిస్తోంది. నౌకాదళ హెలికాఫ్టర్లు ఒకవైపు, నేవీ స్విమ్మర్ల బృందం మరోవైపు, ఎన్డీఆర్​ఎఫ్, ఎస్​డీఆర్ఎఫ్ బృందాలు ఇంకోవైపు విస్తృతంగా నదిని జల్లెడ పడుతున్నా గల్లంతైన 35 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.

సుడిగుండాలతో సతమతం!

కచ్చులూరు వద్ద ప్రవాహ వేగం అధికంగా ఉండటంతో పాటు సుడిగుండాల కారణంగా బోటు జాడను కనుక్కొనే ప్రయత్నంలో గాలింపు సిబ్బంది విఫలమవుతున్నారు. అది ఏ ప్రాంతంలో ఉందో కనుగొన్నప్పటికీ ఎంత లోతులో ఉందన్న విషయం మాత్రం తెలియరావడం లేదు. ఎన్డీఆర్​ఎఫ్ సిబ్బంది అత్యాధునిక సోనార్‌ పరికరంతో బోటు మునిగిన ప్రాంతం వద్ద గాలించే ప్రయత్నం చేసినా అది ఎక్కువ లోతులోకి వెళ్లకపోవడం వల్ల బోటు ఎంత లోతులో మునిగి ఉందన్న అంశం మాత్రం తెలియడం లేదు. నౌకాదళానికి చెందిన స్కూబా డైవర్లు సైతం 60 మీటర్ల లోతుకు మాత్రమే వెళ్లగలిగారు. మట్టితో కూడిన నీరు ఉండటంతో అగ్నిమాపక శాఖకు చెందిన విక్టిం లొకేషన్‌ కెమెరాలు ఎక్కువ లోతులో ఉన్న అంశాలను గుర్తించలేకపోతున్నాయి.

బోటు మునిగిన ప్రాంతంలో ప్రవాహ వేగం 30 నుంచి 40 కి.మీ వేగం ఉండటంతో అక్కడ బోట్లు నిలిపేందుకు సాధ్యపడటం లేదు. ఘటనాస్థలికి దాదాపు 150 మీటర్ల దూరంగా ఉన్న ఇసుక దిబ్బపై నుంచే సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాల్సి వస్తోంది.

ఇవీ చూడండి: బోటు మునిగింది.. పరిమితికి మించిన ప్రయాణికుల వల్లేనా?

Intro:ap_atp_52_16_state_khokho_final_avb_ap10094

Body:ఉత్కంఠగా కొనసాగిన రాష్ట్రస్థాయి ఫైనల్ కోకో పోటీలు.

అనంతపురం జిల్లా రాప్తాడు స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల 30వ సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి అండర్ 13 కోకో పోటీల ఉత్కంఠగా ఫైనల్ పోటీలు కొనసాగాయి.

13 జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు అండర్13 కోకో క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. బాలుర జట్టులో ప్రకాశం మరియు గుంటూరు జట్లు ఫైనల్ చేరగా ఫైనల్లో గుంటూరు జట్టు విజయం సాధించింది. బాలికల జట్టులో అనంతపురం మరియు విజయనగరం జట్టు ఫైనల్ చేరుకోగా విజయనగరం జట్టుపై అనంతపురం జట్టు విజయం
సాధించింది.

విజయం సాధించిన జట్ల కి రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందించడం జరిగింది.

Conclusion:R.Ganesh
RPD(ATP)
cell:9440130913
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.