ప్రజా సంఘాలపై నిర్బంధం, అక్రమ కేసులు, అరెస్టులను ఖండిస్తూ నిర్బంధ వ్యతిరేక వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ ధర్నాచౌక్లో ప్రజా సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనను.. వ్యక్తం చేయలేని దుస్థితి నెలకొనడం విచారకరమని పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ ఆరోపించారు. ప్రజాస్వామ్యం పాలకుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజురోజుకు తీవ్రమవుతున్న నిర్బంధాన్ని సంఘటితంగా ప్రతిఘటించాలని కోరారు.
చట్టబద్ధ పాలన అందించాలి..
రాష్ట్రంలో ప్రజాస్వామిక పాలనకు మంచి వాతావరణాన్ని, చట్టబద్ధ పాలన అందించాల్సిన అవసరం ఉందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ పేర్కొన్నారు.. రాష్ట్రంలో సీఏఏకు వ్యతిరేకంగా నిర్వహించే సభల అనుమతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు సరికాదన్నారు. ప్రొఫెసర్ ఖాసీంను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: ఒక్కరు కాదు... లక్ష మంది అసదుద్దీన్ ఒవైసీలు వచ్చినా...'