యురేనియం తవ్వకాలు కేవలం నల్లమల గిరిజనుల సమస్య మాత్రమే కాదని, దీనివల్ల రాష్ట్రమే విషతుల్యమయ్యే ప్రమాదముందని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షులు ప్రొ.హరగోపాల్ ఆవేదన చెందారు. మహబూబ్నగర్ జిల్లా నల్లమలలో యురేనియం తవ్వకాల వలన నీరు, గాలి, పర్యావరణ, జీవవైవిధ్యం అంత విషతుల్యం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వమే ఉద్యమం చేయాలని కోరారు. అభివృద్ధి అంటే సహజవనరులను ధ్వంసం చేయడమా అని ప్రశ్నించారు.
- ఇదీ చూడండి : బియ్యం బస్తా మోసిన తహసీల్దార్... ఎందుకంటే..?