ETV Bharat / city

అమిత్ షా పర్యటన నేపథ్యంలో సికింద్రాబాద్‌లో పోస్టర్ల కలకలం - సికింద్రాబాద్‌లో అమిత్ షాకు వ్యతిరేకంగా పోస్టర్లు

posters against amit shah :కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టించాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌ పరిధిలో కేంద్రానికి, మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఏ విధంగా సాయపడిందో చెప్పాలని డిమాండ్ చేస్తూ కంటోన్మెంట్ యువత పేరుతో వెలిసిన పోస్టర్లు కలకలం రేపాయి.

posters against amit shah
posters against amit shah
author img

By

Published : Sep 15, 2022, 9:47 AM IST

posters against amit shah : ఈనెల 17 కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న సభలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో నగరంలో పోస్టర్లు కలకలం సృష్టించాయి. అమిత్ షా పర్యటనను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో అర్ధరాత్రి పోస్టర్లు వెలిశాయి. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఏ విధంగా సాయపడిందో చెప్పాలని డిమాండ్ చేస్తూ పరేడ్ గ్రౌండ్స్ పరిధిలో పోస్టర్లు కనిపించాయి. కంటోన్మెంట్ యువత పేరుతో వెలిసిన ఈ పోస్టర్లలో కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించారు.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమిత్ షా చెప్పుల దగ్గర పెట్టిన నాయకుడు ఎవరో చెప్పుకోవాలంటూ కొన్ని పోస్టర్లు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పరిధిలో వెలిశాయి. అమిత్ షా సభను ఉద్దేశించి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన నాయకులు వీళ్లే అంటూ మరికొన్ని పోస్టర్లు కనిపించాయి. కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ రాష్ట్రానికి అభివృద్ధి విషయంలో ఏ విధంగా సహకరించారో చెప్పాలంటూ 20 ప్రశ్నలతో కూడిన పోస్టర్లు కంటోన్మెంట్ యువత పేరుతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో వెలిశాయి.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.