పోస్టల్ బ్యాలెట్లకు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని జీహెచ్ఎంసీ ఎన్నికల అథారిటీ అధికారి లోకేశ్ కుమార్ తెలిపారు. గ్రేటర్ ఎన్నికలకు పోస్టల్ బ్యాలెట్‌ను పంపే ఓటర్లకు ఆ ఛార్జీలను జీహెచ్ఎంసీ చెల్లిస్తుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ కవర్లను ఆర్వోకు అందించేందుకు పోస్టల్ స్టాంపులు అవసరం లేదన్నారు.
పోస్టల్ శాఖకు బీఎన్పీఎల్ అకౌంట్ నంబర్ 2019, కస్టమర్ ఐడీ 6000014601 ద్వారా జీహెచ్ఎంసీ పోస్టల్ వ్యయాన్ని చెల్లిస్తుందని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఉన్న ఎన్వలప్ మీద బీఎన్పీఎల్ అకౌంట్ నంబర్, కస్టమర్ ఐడీ రాయాలని పేర్కొన్నారు.