ETV Bharat / city

పుర ఎన్నికలకు పోలింగ్​ కేంద్రాల సంఖ్య ఖరారు

పుర ఎన్నికల కోసం ఎన్నికల సంఘం పోలింగ్​ కేంద్రాల సంఖ్యను ఖరారు చేసింది. పది నగరపాలక సంస్థల్లో, 120 పురపాలికల్లో పోలింగ్​ కేంద్రాల తుది జాబితాను ఈసీ ప్రకటించింది.

polling stations declared for muncipal elections in telangana
పుర ఎన్నికలకు పోలింగ్​ కేంద్రాల సంఖ్య ఖరారు
author img

By

Published : Jan 14, 2020, 4:29 PM IST

Updated : Jan 14, 2020, 7:25 PM IST

పుర ఎన్నికలకు పోలింగ్​ కేంద్రాల సంఖ్య ఖరారు

పురపాలక ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాల సంఖ్య ఖరారైంది. ఈ మేరకు తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పది నగరపాలక సంస్థల్లోని 385 వార్డులకు గానూ 1786 పోలింగ్ కేంద్రాలున్నాయి. నిజామాబాద్ నగర పాలకసంస్థలో ఎక్కువ సంఖ్యలో 411 కేంద్రాలు ఉండగా... కరీంనగర్​లో 348, రామగుండంలో 242 చోట్ల ఓటింగ్​కు ఏర్పాట్లు చేస్తున్నారు. తక్కువ సంఖ్యలో బండ్లగూడ జాగీర్​లో కేవలం 85 పోలింగ్ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. 120 పురపాలక సంస్థల్లోని 2727 వార్డులకుగానూ 6325 పోలింగ్ కేంద్రాలున్నాయి.

కరీంనగర్​లో 24న పోలింగ్

పురపాలికల్లో అత్యధికంగా మహబూబ్ నగర్​లో 240 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఆదిలాబాద్​లో 183, నల్గొండలో 180, సూర్యాపేటలో 146, మిర్యాలగూడలో 144 పోలింగ్ కేంద్రాలున్నాయి. తక్కువ సంఖ్యలో డోర్నకల్, వర్ధన్నపేట, కొత్తపల్లి, ధర్మపురిలో కేవలం 15 చొప్పున కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 22న తొమ్మిది కార్పొరేషన్లలోని 1438 పోలింగ్ కేంద్రాలు,120 పురపాలికల్లోని 6325 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగనుంది. కరీంనగర్ కార్పొరేషన్​లోని 348 పోలింగ్ కేంద్రాల్లో 24వ తేదీన పోలింగ్ జరగనుంది. 25న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇవీ చూడండి: బస్తీమే సవాల్: మున్సిపల్​ వార్​లో యువత బస్తీమే సవాల్

File : TG_Hyd_30_14_Polling_Stations_Dry_3053262 From : Raghu Vardhan ( ) పురపాలక ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాల సంఖ్య ఖరారైంది. ఈ మేరకు పోలింగ్ కేంద్రాల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పది నగరపాలకసంస్థల్లోని 385 వార్డులకు గాను 1786 పోలింగ్ కేంద్రాలున్నాయి. నిజామాబాద్ నగర పాలకసంస్థలో ఎక్కువ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలున్నాయి. ఇక్కడ పోలింగ్ కేంద్రాల సంఖ్య 411. కరీంనగర్ నలో 348, రామగుండంలో 242 పోలింగ్ కేంద్రాలున్నాయి. తక్కువ సంఖ్యలో బండ్లగూడ జాగీర్ లో కేవలం 85 పోలింగ్ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. 120 పురపాలక సంస్థల్లోని 2727 వార్డులకు గాను 6325 పోలింగ్ కేంద్రాలున్నాయి. పురపాలికల్లో అత్యధికంగా మహబూబ్ నగర్ లో 240 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఆదిలాబాద్ లో 183, నల్గొండలో 180, సూర్యాపేటలో 146, మిర్యాలగూడలో 144 పోలింగ్ కేంద్రాలున్నాయి. తక్కువ సంఖ్యలో డోర్నకల్, వర్ధన్నపేట, కొత్తపల్లి, ధర్మపురిలో కేవలం 15 చొప్పున పోలింగ్ కేంద్రాలున్నాయి. ఈ నెల 22న తొమ్మిది కార్పోరేషన్లలోని 1438 పోలింగ్ కేంద్రాలు,120 పురపాలికల్లోని 6325 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగనుంది. కరీంనగర్ కార్పోరేషన్ లోని 348 పోలింగ్ కేంద్రాల్లో 24వ తేదీన పోలింగ్ జరగనుంది.
Last Updated : Jan 14, 2020, 7:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.