ETV Bharat / city

అమలాపురం విధ్వంసం వెనుక ఎవరి హస్తం ఉంది?

Amalapuram Riots News : అమలాపురం అల్లర్లకు పాల్పడిన ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వేట ముమ్మరం చేశారు. 46 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు 19 మందిని అరెస్ట్ చేశారు. మరింత మంది అనుమానితుల్ని గుర్తించి బృందాలతో గాలిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది వైకాపా వర్గీయులే ఉన్నారు. మరోవైపు అమలాపురం సహా కోనసీమలోని పలు మండలాల్లో ఇంటర్నెట్ సేవలు వరుసగా రెండో రోజు నిలిపివేశారు.

Amalapuram Riots
Amalapuram Riots
author img

By

Published : May 27, 2022, 8:12 AM IST

Amalapuram Riots News : ఏపీలోని కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో.. మంగళవారం నాటి విధ్వంసం మూలాల శోధనలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఉద్యమం హింసాత్మకంగా మారడం వెనుక కుట్రకోణం ఉందనే వ్యాఖ్యలు రావడంతో ఆ దిశగానూ దర్యాప్తు ముమ్మరం చేశారు. తెదేపా, జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు వైకాపా బీసీ కౌన్సిలర్‌తో మంతనాలు జరిపారని మంత్రి విశ్వరూప్ వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతవరకూ కోనసీమ సాధన సమితి ఆందోళనలోకి రౌడీషీటర్లు చొరబడ్డారని భావించిన పోలీసులకు.. మంత్రి వ్యాఖ్యల దిశగానూ దర్యాప్తు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. మంత్రి వ్యాఖ్యలతో అధికార పార్టీ నాయకుడూ... ఈ కుట్రలో ఉన్నారనే విషయం చర్చనీయాంశంగా మారింది.

సీసీటీవీ ఫుటేజీ, మీడియా, సామాజిక మాధ్యమాల దృశ్యాల ఆధారంగా నిందితుల్నిగుర్తిస్తున్నారు. అమలాపురం సహా పరిసర గ్రామల నుంచి నుంచి ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బుధవారం నాటికి అల్లర్లలో పాల్గొన్నవారిలో వెయ్యి మందిని గుర్తించారు. వీరిలో 46 మందిని కీలక వ్యక్తులుగా భావించి ఎఫ్.ఐ.ఆర్.లో పేర్లు చేర్చారు. వీరిలో దాదాపు అన్ని పార్టీలవారూ ఉన్నట్లు తెలుస్తోంది. అధికంగా వైకాపాకు చెందినవారే ఉన్నారు. మంత్రి విశ్వరూప్ అనుచరుడు, వివిధ కార్యక్రమాల్లో నిత్యం పాల్గొనే అన్యం సాయిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆందోళనకారుల్లో 19 మందిని అరెస్ట్ చేసినట్టు ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు చెప్పారు. శుక్రవారం మరింత మందిని అదుపులోకి తీసుకుంటామని చెప్పారు.

నిలిచిన ఇంటర్​నెట్ సేవలు: అమలాపురంలో వరుసగా రెండోరోజూ ఇంటర్ నెట్ సేవలు ఆపేశారు. ప్రజలకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. మొబైల్ డేటా పనిచేయడం లేదు. బ్యాంకింగ్ ఆన్ లైన్ సేవలు నిలిచిపోయాయి. ఆర్థిక లావాదేవీలు ఆగిపోయాయి. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా నగదు లావాదేవీలు స్తంభించిపోయాయి. ఇంటి వద్ద విధులు నిర్వహిస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఇంటర్ నెట్ లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నెట్ సేవలు క్రమంగా పునరుద్ధరిస్తామని డీఐజీ పాలరాజు చెప్పారు. అమలాపురం పట్టణంలో పోలీసుల పహారా... కొనసాగుతోంది. ప్రధాన కూడళ్లలో బలగాలను మొహరించారు.

బాత్​రూంలో దాక్కున్నా..: ఇంటికి నిప్పు పెట్టడంతో ప్రమాదం నుంచి బయటపడ్డ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుటుంబ సభ్యుల్ని ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్యే చిట్టిబాబు, ముమ్మిడివరం నియోజకవర్గ నాయకులు పరామర్శించారు. తన ఇంటిపైకి దాడికి వచ్చినప్పుడు తనపాటు కుటుంబ సభ్యులు బాత్ రూంలో దాక్కున్నామని చెప్పారు. వీడియో దృశ్యాలు, సీసీ ఫుటేజీ ఉండటంతో అనుమానితుల్ని త్వరగా పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.