తూర్పు గోదావరి జిల్లా సీతానగరం పోలీసుస్టేషన్‌లోనే ఎస్సీ యువకుడు వరప్రసాద్‌కు శిరోముండనం చేశారు పోలీసులు. యువకుడిని కొట్టి మీసాలు, జుట్టు కత్తిరించారు. ఇసుక లారీలను ఆపినందుకు దాడిచేశారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఇసుక లారీలను ఆపిన సమయంలో స్థానిక వైకాపా నాయకుడు వచ్చాడు. అతడి అనుచరుడి ఫిర్యాదుతో వరప్రసాద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సీతానగరం పీఎస్‌కు తీసుకెళ్లారు.
పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన వరప్రసాద్‌కు శిరోముండనం చేసిన పోలీసులు... తీవ్రగాయలయ్యేలా కొట్టారు. అనంతరం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో పోలీసుల తీరుపై ఎస్సీ, ఎస్టీ సంఘాల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టాయి. జరిగిన ఘటనపై కోరుకొండ డీఎస్పీ విచారణ చేపట్టారు. వెదుళ్లపల్లిలో బాధితుడు వరప్రసాద్ ఇంటికి వెళ్లి విచారించారు. సీతానగరం ఎస్.ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లపై డీఎస్పీ కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రపతిని కలిసి అన్ని విషయాలు వివరించా: ఎంపీ రఘురామకృష్ణరాజు