ETV Bharat / city

ఈనెల 28న హైదరాబాద్​కు మోదీ... కొవాగ్జిన్​ పురోగతి పరిశీలన - modi visit bhart boitech

PM MODI COMING TO HYDERABAD
PM MODI COMING TO HYDERABAD
author img

By

Published : Nov 26, 2020, 5:25 PM IST

Updated : Nov 26, 2020, 6:11 PM IST

17:23 November 26

ఈనెల 28న హైదరాబాద్​కు మోదీ... కొవాగ్జిన్​ పురోగతి పరిశీలన

హైదరాబాద్​కు ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. ఈనెల 28న హైదరాబాద్​కు మోదీ రానున్నారు. భారత్ బయోటెక్ సంస్థ తయారు చేస్తున్న కొవిడ్ వ్యాక్సిన్ పురోగతి పరిశీలన కోసం నరేంద్రమోదీ హైదరాబాద్ రానున్నారు. 28 మధ్యాహ్నం తర్వాత దిల్లీ నుంచి నేరుగా హకీంపేట విమానాశ్రయానికి ప్రధాని చేరుకోనున్నారు. అక్కడి నుంచి శామీర్‌పేట సమీపంలోని భారత్‌ బయోటెక్‌ను మోదీ సందర్శిస్తారు. కొవిడ్‌ నివారణకు సంబంధించి భారత్‌ బయోటెక్‌ సిద్ధం చేస్తున్న ‘కొవాగ్జిన్‌’ టీకా పురోగతిని పరిశీలించనున్నారు. 

భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కొవాగ్జిన్ టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఐసీఎంఆర్​తో కలిసి భారత్ బయోటెక్ సంస్థ కొవిడ్​కు వ్యాక్సిన్​ తయారు చేస్తోంది. వ్యాక్సిన్ తయారీ, పురోగతి, ప్రస్తుత స్థితి తదితర అంశాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలుసుకోనున్నారు. అనంతరం ప్రధాని పుణె పర్యటనకు వెళ్లనున్నారు. 

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని హైదరాబాద్‌కు రానుండటం ఆసక్తికరంగా మారింది. అయితే ఆయన గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా? లేదా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు ఇప్పటికే భాజపా జాతీయ నేతల పర్యటనలు ఖరారయ్యాయి. 27న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, 28న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, 29న కేంద్రహోంమంత్రి అమిత్‌షా హైదరాబాద్‌ రానున్నారు. వీరంతా గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే రోడ్‌షోల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ కూడా హైదరాబాద్‌ రానుండటం ఆసక్తికరంగా మారింది.

ఇదీ చూడండి: 'లా అండ్ ఆర్డర్ సమస్యలుంటే చర్యలేందుకు తీసుకోవట్లేదు?'

Last Updated : Nov 26, 2020, 6:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.