ETV Bharat / city

'పేట్లబురుజు​'.. దేశంలోనే ఉత్తమ పోలీస్ ట్రైనింగ్ సెంటర్​ - india's best police training center is petla burj

దేశంలోనే ఉత్తమ పోలీసు శిక్షణా కేంద్రంగా హైదరాబాద్​లోని పేట్లబురుజు సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఎంపికైంది. 2019-20 సంవత్సరానికి గానూ ఈ ట్రీఫీని కేంద్ర హోం శాఖ ప్రకటించింది.

Petla Burj is the vbest Police Training Institution in India
దేశంలోనే ఉత్తమ పోలీస్ ట్రైనింగ్ సెంటర్​గా పేట్లబురుజు​ పీటీసీ
author img

By

Published : Feb 4, 2021, 11:28 AM IST

దేశంలోనే ఉత్తమ పోలీస్ ట్రైనింగ్ సెంటర్​గా హైదరాబాద్​లోని పేట్ల బురుజు పోలీసు శిక్షణా కేంద్రం ఎంపికైనట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. 2019-20 ఏడాదిలో బెస్ట్ ట్రైనింగ్ సెంటర్​గా ఎన్నికైన పాతబస్తీ పేట్లబురుజులోని శిక్షణా కేంద్రానికి ఇంఛార్జ్​గా ఉన్న సీపీ ఎల్​ఎస్​ చౌహాన్​కు అభినందనలు తెలిపారు.

వివిధ భాగాల్లో వందలాది మంది పోలీసులు పీటీసీలో శిక్షణ పొందారని.. ఇక్కడి శిక్షణ వారిని వారివారి విభాగాల్లో అత్యుత్తమ సేవలందించేలా తీర్చిదిద్దిందని సీపీ తెలిపారు. ట్రోఫీతో పాటు రూ.2 లక్షలను కేంద్రం హోం శాఖ ప్రకటించినట్లు వెల్లడించారు. ఉత్తమ శిక్షణ కేంద్రంగా ఎంపికవ్వడానికి కృషి చేసిన సిబ్బందిని సీపీ సత్కరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.