Godavari Floods People Facing Problems: గోదావరి వరద గణనీయంగా తగ్గినప్పటికి ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా చాకలి పాలెం సమీపంలోని.. పశ్చిమగోదావరి జిల్లా కనకాయలంక కాజ్వే ఈరోజు కూడా వరద ముంపులోనే ఉంది. కనకాయలంక గ్రామ ప్రజలు ముంపులో ఉన్న కాజ్వేపై నుంచి ప్రమాదకరంగా చాకలిపాలెం వైపు రాకపోకలు కొనసాగిస్తున్నారు.
ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి ఈరోజు 2,75,000 క్యూసెక్కుల వరద నీటిని విడిచిపెట్టారు. నిన్నటితో పోలిస్తే ఈరోజు సముద్రంలోకి విడిచి పెడుతున్న వరద నీరు సగానికి తగ్గింది. అయినా ఇక్కడ కాజ్వే ఇంకా ముంపులోనే ఉంది.
ఇవీ చదవండి:నిన్న బండారుగుంపు.. నేడు గాండ్లగూడ.. ఆగని పోడు భూముల పోరు.