దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికలు రావొచ్చని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. 2024 వరకు ఎన్నికల కోసం వేచి ఉండాల్సిన పనిలేదని అన్నారు. ఈ మేరకు సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. బుధవారం ఏపీలోని మంగళగిరిలో గల పార్టీ కార్యాలయంలో రెండో విడత సభ్యత్వ నమోదు ప్రక్రియపై 32 నియోజకవర్గ నేతలతో నిర్వహించిన సమావేశంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశమంతా ఒకేసారి ఎన్నికలు కాబట్టి ఏపీలోనూ ముందుగానే ఉంటాయి. అందుకే ప్రతి క్రియాశీలక సభ్యులు 50 నుంచి 100 మందిని ప్రభావితం చేసేలా తయారు కావాలి. జనసేనకు జన బలం ఉన్నా స్థానిక నాయకత్వం లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఎక్కడికక్కడ నాయకులు బలోపేతం కావాలి. ప్రతి చోటికీ నేనే వచ్చి మాట్లాడాలని భావించవద్దు. ఇతర పార్టీల నుంచి వచ్చే వారి విషయంలో జనసేన శ్రేణుల అభిప్రాయానికి విలువ ఇవ్వాలి. ఎవరికైనా పార్టీ సిద్ధాంతాలు నచ్చకపోతే బయటకు వెళ్లిపోవచ్చు. ఒక్కరు వెళ్తే వంద మందిని పార్టీలోకి తీసుకువస్తా. అలాగే పార్టీ బలోపేతానికి నియోజకవర్గాల వారీగా ఏం చేయాలనే అంశాలపై కూడా భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేయండి- పవన్ కల్యాణ్
ఇవీ చూడండి: జీహెచ్ఎంసీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన తెరాస