Pawan kalyan tweet: జనసేనాని పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికర పోస్టు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న వేళ.. శాంతి-యుద్ధంపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. యుద్ధం, శాంతి గురించి తనదైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
"ఒక మార్పుకోసం యుద్ధం చేయాల్సి వస్తే.. 99 సార్లు శాంతియుతంగానే ప్రయత్నిస్తాను. నూరవసారే యుద్ధం చేస్తాను" అంటూ.. తన ఆలోచనా విధానాన్ని ట్వీట్ చేశారు పవన్. ఈ కోట్కు.. కలంతో పుస్తకంలో రాసుకుంటున్న తన చిత్రాన్ని జోడించారు.
మార్పుకోసమే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో.. ఓవైపు రాష్ట్రంలో అధికార పక్షంపై పవన్ యుద్ధం సాగిస్తోంటే.. మరోవైపు ప్రపంచాన్ని యుద్ధ మేఘాలు ఆవరించాయి. ఇలాంటి సందర్భంలో ఈ రెంటినీ మేళవిస్తూ ఈ ట్వీట్ చేశారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.
- — Pawan Kalyan (@PawanKalyan) March 2, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
— Pawan Kalyan (@PawanKalyan) March 2, 2022
">— Pawan Kalyan (@PawanKalyan) March 2, 2022
ఇదీ చదవండి: