ETV Bharat / city

ఆన్​లైన్​లో హాస్టల్​ బుకింగ్​... అందులోనూ డిస్కౌంట్​...

author img

By

Published : Nov 8, 2019, 9:49 AM IST

మీరు హాస్టల్​లో ఉంటున్నారా? కొత్తగా చేరాలనుకుంటున్నారా? అందులోనూ డిస్కౌంట్​ కోరుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆన్​లైన్​లో హాస్టల్​ బుకింగ్​ చేసుకునేందుకు థింక్​ వైడ్​ హాస్పిటాలిటీ ప్రైవేట్​ లిమిటెడ్​ సంస్థ... తమ పీజీవో ప్రైమ్ మెంబర్​షిప్​ను ప్రకటించింది.

ఆన్​లైన్​లో హాస్టల్​ బుకింగ్​... అందులోనూ డిస్కౌంట్​

ఆన్​లైన్​లో హాస్టల్​ను బుకింగ్​ చేసుకునే అవకాశాన్ని థింక్​ వైడ్​ హాస్పిటాలిటీ ప్రైవేటు లిమిటెడ్​ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. తమ కస్టమర్ల కోసం ఇప్పుడు కొత్తగా ప్రైమ్​ మెంబర్​షిప్​ను లాంచ్​ చేసింది. హాస్టల్, వసతి ప్రాంతాలను గుర్తించి తెలియజేసే టెక్నాలజీ స్టార్టప్​గా పీజీవో ప్రారంభమైంది. నేడు వేలాది హాస్టళ్లు, పీజీలతో కలిసి పనిచేస్తూ... దేశవ్యాప్తంగా లక్షలాది వేలాది కస్టమర్లను సంపాదించుకుంది. ఎలాంటి శ్రమ లేకుండా పీజీవో యాప్​లో హాస్టళ్లు, పీజీల... రివ్యూలు, ఫొటోలు చూసి బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది థింక్ వైడ్ సంస్థ.

2 మిలియన్ డాలర్ల పెట్టుబడి

పీజీవోకు మరో 2మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు పెట్టుబడిదారులు ముందుకొచ్చారు. ఎక్తా సంస్థ శ్రీని ముసాని, ఐఆర్​ఏ రియాలిటీ సంస్థ నర్సిరెడ్డి పోషం సంయుక్తంగా పెట్టుబడి పెడుతున్నట్లు సంస్థ ఫౌండర్ సీఈఓ హరికృష్ణ ప్రకటించారు. పెరుగుతున్న ఉపాధి అవకాశాలు, సుదూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నందున... ఆన్​లైన్​లో పీజీల కోసం వెతికే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. అలాంటి వారికి ఎలాంటి రిస్క్ లేకుండా చక్కని పీజీలను అందించటమే పీజీఓ లక్ష్యమని వారు తెలిపారు.

ఇదీ చూడండి: సకల సౌకర్యాలతో పునరావాసం... స్థానికుల్లో సంతోషం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.