రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల మరోసారి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బాలమూరి వెంకట్ ధ్వజమెత్తారు. బ్యాక్ లాగ్స్ విద్యార్థులను ప్రమోట్ చేస్తామని చెప్పిన ప్రభుత్వమే.. ఎంసెట్ ఫలితాల్లో 40శాతం పైన మార్కులు వచ్చిన వారికీ నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చిందని తెలిపారు. విద్యార్థులపట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అర్థమవుతుందని వెంకట్ ఆరోపించారు.
24 గంటల్లో విద్యాశాఖ చేసిన తప్పును సరిదిద్దుకోవాలన్నారు. లేదంటే విద్యార్థుల పక్షాన మరోసారి ఎన్‌ఎస్‌యూఐ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. తప్పుని సవరించే వరకు అక్టోబర్ 9న జరిగే ఎంసెట్ కౌన్సిలింగ్ జరుగకుండా అడ్డుకుంటామన్నారు. విద్యార్థులు ఎవరూ అందోళన చెందవద్దని ఎన్‌ఎస్‌యూఐ అండగా ఉంటుందని పేర్కొన్నారు.