NSG inspected CBN house: ఏపీలోని తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌ను ఎన్ఎస్జీ (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) బృందం పరిశీలించింది. దిల్లీ నుంచి వచ్చిన ఐజీ సిమిర్దీప్ సింగ్ నేతృత్వంలోని బృందం.. పార్టీ కార్యాలయంతో పాటు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసాన్ని భద్రతా కోణాల్లో అన్ని గదులను పరిశీలించారు.
ఇటీవల చంద్రబాబు పర్యటనల్లో తరుచూ గొడవలు జరుగుతుండటం, చంద్రబాబు నివాసం, పార్టీ కార్యాలయంపై దాడి వంటివి పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు భద్రతపై ఎన్ఎస్జీ ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, పోలీసుల నిర్లక్ష్యం, చంద్రబాబు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ తెదేపా ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. తమ ఫిర్యాదుల మేరకు కేంద్రం ప్రత్యేకంగా పరిశీలనకు పంపినట్లు తెదేపా వర్గాలు వెల్లడించాయి.
దాడులను పరిగణనలోకి తీసుకోవడం అభినందనీయం: చంద్రబాబు భద్రతపై కేంద్రానికి శ్రద్ధ ఉండటం అభినందనీయమని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు అన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాడులు జరుగుతున్నాయని, వీటిని ఎన్ఎస్‌జీ పరిగణనలోకి తీసుకుందని తెలిపారు. రాష్ట్రంలో భద్రతా వైఫ్యల్యంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. మేం కేంద్రం దృష్టికి తీసుకెళ్లక ముందే ఎన్ఎస్‌జీ చొరవ తీసుకుందని తెలిపారు. తెదేపా క్యాడర్‌ను తట్టుకునే శక్తి వైకాపాకు లేదని అశోక్‌బాబు అన్నారు.
ఇవీ చదవండి: డీజీపీ కార్యాలయం ముట్టడికి తెదేపా యత్నం, ఉద్రిక్తత
ఇంటికి కిలో బంగారం ఇచ్చినా తెరాస ఓటమి ఖాయమన్న రాజగోపాల్‌రెడ్డి
టిక్‌టాక్ స్టార్ మృతి కేసులో ట్విస్ట్, హత్యేనని తేల్చిన పోలీసులు, ఇద్దరు అరెస్ట్