ETV Bharat / city

తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి జ్యోతుల నెహ్రూ రాజీనామా

ఏపీలోని జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పరిషత్ ఎన్నికలకు చంద్రబాబు దూరమని ప్రకటించడమే రాజీనామాకు కారణంగా తెలుస్తోంది.

nehru, tdp state vice president
జ్యోతుల నెహ్రూ, జగ్గంపేట
author img

By

Published : Apr 2, 2021, 10:49 PM IST

ఏపీలో తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట తెదేపా ఇన్‌ఛార్జ్‌గా మాత్రం కొనసాగుతానని చెప్పారు. పరిషత్‌ ఎన్నికలను బహిష్కరించాలని పార్టీ ప్రకటించడం తనను నిరాశకు గురిచేసిందన్నారు. ఈ నేపథ్యంలోనే తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు.

జ్యోతుల నెహ్రూ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994, 1999 ఎన్నికల్లో తెదేపా తరఫున విజయం సాధించిన ఆయన.. 2014లో వైకాపా నుంచి గెలుపొందారు. 2014 ఎన్నికల తర్వాత నెహ్రూ తెదేపాలో చేరారు. 2019 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి జ్యోతుల చంటిబాబు చేతిలో ఓటమి పాలయ్యారు.

ఇదీ చదవండి: కోర్టు ధిక్కరణ కేసులో సిరిసిల్ల కలెక్టర్ కృష్ణభాస్కర్​కు ఊరట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.