ETV Bharat / city

యువత వ్యవసాయాన్ని అందిపుచ్చుకుంటే తిరుగుండదు: నాబార్డు ఛైర్మన్​ - తెలంగాణ తాజా వార్తలు

యువత వ్యవసాయాన్ని అందిపుచ్చుకుంటే తిరుగు ఉండదని నాబార్డు ఛైర్మన్​ డాక్టర్​ చింతల గోవిందరాజులు అన్నారు. వ్యవసాయాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్ది యువత, పట్టభద్రులను ఆ దిశగా మళ్లించేందుకు నాబార్డు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుందన్నారు.

NABARD CHAIRMAN
నాబార్డు ఛైర్మన్​ డాక్టర్​ చింతల గోవిందరాజు
author img

By

Published : May 18, 2021, 5:39 AM IST

దేశంలో ప్రతికూల పరిస్థితుల్లో సైతం వ్యవసాయ రంగంలో అద్భుతమైన వృద్ధి కొనసాగుతోందని నాబార్డ్ ఛైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులు అన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్ - నార్మ్‌ సంస్థలో జూమ్ ద్వారా జరిగిన అగ్రి-ఉడాన్ 4.0 కార్యక్రమాన్ని ఆయన ముంబయి నుంచి ప్రారంభించారు.

దేశంలో.. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో అంకుర కేంద్రాలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా తీర్చిదిద్ది రైతులకు మెరుగైన ఆదాయాల కల్పనపై విస్తృతంగా చర్చించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో కొత్త విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు రైతులకు మరింత చేరవేత వంటి అంశాలు ప్రస్తావించారు. ఇప్పటికే నార్మ్ ఆధ్వర్యంలో ఏ-ఐడియా నేతృత్వంలో అంకుర కేంద్రాలకు ఇస్తున్న ప్రోత్సాహం వల్ల రైతులకు అందుతున్న సేవలు అద్భుతంగా ఉన్నాయని డాక్టర్ చింతల ప్రశంసించారు.

దేశంలో మునుపెన్నడూ లేనిరీతిలో 2020-21లో 303 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగిందని చెప్పారు. 350 మిలియన్ టన్నుల పండ్లు, కూరగాయల ఉత్పత్తి సాధించిన ఘనత దక్కిందని... 2012-13 నుంచి ఇదే ఒరవడి కొనసాగిస్తున్న రైతులకు అభినందనలు తెలియజేశారు. కొవిడ్-19 నేపథ్యంలో వ్యవసాయ రంగం, రైతాంగానికి మెరుగైన సేవలందించేందుకు అంకుర కేంద్రాలు, ఆవిష్కరణలు నాబార్డు ప్రోత్సహిస్తుందని వెల్లడించారు.

వ్యవసాయ అనుబంధ రంగాల్లో అద్భుతమైన పురోగతి సాధిస్తున్నప్పటికీ ఎన్నో సవాళ్లు వేధిస్తున్నాయన్నారు. వ్యవసాయాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్ది యువత, పట్టభద్రులను ఆ దిశగా మళ్లించేందుకు నాబార్డు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. భారతదేశ జనాభాలో సగం మంది పైగా ప్రత్యక్షంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న దృష్ట్యా... యువ రక్తం ఈ రంగాన్ని అందిపుచ్చుకునేలా ప్రోత్సహించినట్లైతే... ఇక తిరుగు ఉండదని గోవిందరాజులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్​రంజన్‌, ఎన్‌ఎస్‌టీఈడీబీ అధిపతి డాక్టర్ అనిత గుప్తా, నీతిఆయోగ్ మిషన్ డైరెక్టర్ ఆర్.రమణన్‌, నార్మ్ డైరెక్టర్ డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు, నాబార్డ్ సీజీఎం వైకే రావు, హెచ్‌సీయూ ఉపకులపతి ప్రొఫెసర్​ పొదిల అప్పారావు, వివిధ రాష్ట్రాల శాస్త్రవేత్తలు, నిపుణులు పాల్గొన్నారు.

యువత వ్యవసాయాన్ని అందిపుచ్చుకుంటే తిరుగుండదు: నాబార్డు ఛైర్మన్​

ఇవీచూడండి: యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేయాలి: బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.