ETV Bharat / city

YCP MP Vijayasai Reddy: మాదక ద్రవ్యాలకు పురుడు పోసింది తెదేపానే.. - చంద్రబాబుపై విజయసాయి ఫైర్

వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించితే తెదేపాను భాజపాలో కలుపుతామని చంద్రబాబు ప్రతిపాదనలు పంపారని ఏపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు(mp vijayasai reddy sensational comments on chandrababu news). విశాఖలో జనాగ్రహ దీక్షలో మాట్లాడిన ఆయన.. స్వలాభం కోసమే మోదీని చంద్రబాబు మోసం చేశారన్నారు. ఉత్తరాంధ్రలో మాదకద్రవ్యాలకు పురుడు పోసింది తెదేపా నేతలేనని వ్యాఖ్యానించారు.

YCP MP Vijayasai Reddy: 'భాజపాలో తెదేపా విలీనం కోసం చంద్రబాబు ప్రతిపాదనలు'

author img

By

Published : Oct 22, 2021, 4:43 PM IST

తెదేపా అధినేత చంద్రబాబుపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్వలాభం కోసమే ప్రధాని నరేంద్ర మోదీని చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు(mp vijayasai reddy comments on chandrababu). ఉత్తరాంధ్రలో మాదకద్రవ్యాలకు పురుడు పోసిందే తెదేపా నేతలేనన్నారు. రూ.500 కోట్ల గంజాయి అక్రమ రవాణా జరిగిందన్నారు. విశాఖలో జరిగిన వైకాపా జనాగ్రహ దీక్షలో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో తనను నమ్మడం లేదనే చంద్రబాబు దిల్లీ వెళ్తున్నారన్నారు. నర్సీపట్నం ప్రజలు వద్దని చెప్పినా.. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి బుద్ధిరాలేదని వ్యాఖ్యానించారు. భాజపా పెద్దలకు చంద్రబాబు ప్రతిపాదనలు పంపారనీ.. వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించితే తెదేపాను భాజపాలో కలుపుతామన్నారంటూ విజయసాయిరెడ్డి ఆరోపించారు.

  • టీడీపీ అసభ్య దూషణలను నిరసిస్తూ జీవీఎంసీ కార్యాలయం వద్ద కార్పొరేటర్ మహమ్మద్ సాదిఖ్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనాగ్రహ దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలపడం జరిగింది. విశాఖ ఎంపీ శ్రీ ఎంవీవీ సత్యనారాయణ, జీవీఎంసీ మేయర్ శ్రీమతి హరి వెంకటకుమారి తదితరులు పాల్గొన్నారు. pic.twitter.com/paa18poCkv

    — Vijayasai Reddy V (@VSReddy_MP) October 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'ప్రధాని మోదీని స్వలాభం కోసమే చంద్రబాబు మోసం చేశారు. ఉత్తరాంధ్రలో మాదకద్రవ్యాలకు పురుడు పోసింది తెదేపా నేతలే. రూ.500కోట్ల గంజాయి అక్రమ రవాణా జరిగింది. భాజపా పెద్దలకు చంద్రబాబు ప్రతిపాదనలు పంపారు. వైకాపా సర్కారును గద్దె దించితే తెదేపాను భాజపాలో కలుపుతామన్నారు' - విజయసాయిరెడ్డి, వైకాపా ఎంపీ

దేవాలయంలో బూతులా..? సజ్జల

గుంటూరులో జరిగిన జనాగ్రహ దీక్షలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(sajjala ramakrishna reddy fires on tdp news) పాల్గొన్నారు. తెదేపా కార్యాలయం దేవాలయమని చంద్రబాబు అన్నారు.. మరి దేవాలయంలో బూతులు ఎలా మాట్లాడనిచ్చారు? అని ప్రశ్నించారు. బూతులపై చంద్రబాబు ఉద్యమం నిర్మిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు.. జగన్‌ను పదవి నుంచి దింపాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

ఇదీ చదవండి:

paritala sunitha Comments : మాకూ బీపీ వస్తోంది.. ఏం చేస్తామో త్వరలో చూపిస్తాం: పరిటాల సునీత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.