ETV Bharat / city

"కొనలేరు... వినలేరు" కథనానికి స్పందన.. టీవీ అందించిన ఎంపీ రంజిత్​ - టీవీ అందించిన ఎంపీ రంజిత్​

ఆన్​లైన్​ పాఠాలు వినేందుకు స్మార్ట్​ఫోన్​లు, టీవీలు లేక పేద కుటుంబం పడుతున్న ఇబ్బందులపై ఈనాడు ప్రచురించిన కథనానికి చేవెళ్ల ఎంపీ రంజిత్​ రెడ్డి స్పందించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి సమీపంలోని లాలాముత్నూరు గ్రామానికి చెందిన గంగ కుటుంబ వ్యథను చూసి చలించిపోయిన రంజిత్​రెడ్డి తన వంతుగా టీవీ కోసం రూ.15వేలు నగదు అందజేశారు.

"కొనలేరు... వినలేరు" కథనానికి స్పందన.. టీవీ అందించిన ఎంపీ రంజిత్​

author img

By

Published : Sep 19, 2020, 4:50 PM IST

"కొనలేరు... వినలేరు" "విద్యార్థులపై ఆర్థిక భారం - అప్పు చేసి స్మార్ట్ ఫోన్లు కొంటున్న తల్లితండ్రులు" అన్న శీర్షికతో "ఈనాడు" లో ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది. "కూలీ పనులే ఆధారం... ఫోన్ ఎలా కొనగలం" అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి చేవెళ్ల ఎంపీ డాక్టర్ గుర్రం రంజిత్‌రెడ్డి స్పందించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి సమీపంలోని లాలాముత్నూరుకు చెందిన గంగ అనే మహిళ... తన ముగ్గురు పిల్లలకు ఆన్​లైన్​ తరగతులు వినేందుకు స్మార్ట్​ఫోన్​, టీవీ లేక ఇబ్బంది పడుతున్నారు. వారి బాధను అర్ధం చేసుకుని ముగ్గురు పిల్లలు ఆన్​లైన్​ పాఠాలు వినేలా టీవీ సమకూర్చేందుకు ఎంపీ రంజిత్​రెడ్డి ముందుకొచ్చారు.

లాలాముత్నూరు గ్రామ సర్పంచి ద్వారా ఆ కుటుంబంతో ఏంపీ రంజిత్ రెడ్డి ఫోన్​లో మాట్లాడారు. కొవిడ్-19 నేపథ్యంలో ఆన్‌లైన్ ద్వారా పాఠాలు వినేందుకు ఆ ముగ్గురు పిల్లలు పడుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. టెలివిజన్ కొనుగోలు కోసం అవసరమైన రూ.15 వేలను సర్పంచ్​ ఖాతాకు బదిలీ చేశారు. ఆ మొత్తాన్ని గ్రామ పెద్దలు కలిసి వెళ్లి ఆ కుటుంబానికి అందజేశారు.

గంగ కుటుంబానికి టీవీ అందిస్తున్న లాలా ముత్నూరు గ్రామ సర్పంచ్​

మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చిన్నారులు విద్యకు దూరం కాకూడదని తాను ఈ వితరణ చూపినట్లు ఎంపీ వెల్లడించారు. ఆ ఇంట్లో టీవీ ఏర్పాటు చేసిన తర్వాత పిల్లలు విధిగా పాఠాలు వినేలా తగిన పర్యవేక్షణ ఉంచడమే కాకుండా.. చదువు ప్రాముఖ్యతను అందరికి తెలియజేయాలని సర్పంచ్​కి సూచించారు. తమ ఇంట్లో టీవీ కోసం నగదు అందజేసిన ఎంపీకి... గంగ కుమారులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక నుంచి తాము బాగా చదువుకుంటామని హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి: ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. ఆన్​లైన్​ విద్యకోసం ఎంపీ సాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.