ETV Bharat / city

హైదరాబాద్​ బ్రాండ్​ ఇమేజ్​ దెబ్బతినకుండా చర్యలు తీసుకోండి: కిషన్​రెడ్డి

హైదరాబాద్​ బ్రాండ్​ ఇమేజ్​ దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ముషీరాబాద్​లోని వరద ప్రభావిత ప్రాంతమైన నాగమయ్య కుంటలో ఆయన పర్యటించారు. ప్రతి వర్షాకాలంలో వరద నీరు ఇళ్లలోకి వస్తోందంటూ బాధితులు కిషన్​రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు

author img

By

Published : Oct 23, 2020, 3:31 PM IST

kishan reddy
హైదరాబాద్​ బ్రాండ్​ ఇమేజ్​ దెబ్బతినకుండా చర్యలు తీసుకోండి: కిషన్​రెడ్డి

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్​రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఇటీవల కురిసిన వర్షానికి జలమయమైన ముషీరాబాద్ నియోజకవర్గం లోతట్టు ప్రాంతాలను ఆయన సందర్శించారు. రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో నాగమయ్య కుంట ప్రాంతంలో పర్యటించారు.

ప్రతి వర్షాకాలంలో ఇళ్లలోకి వరద నీరు వస్తోందంటూ బాధితులు కిషన్​రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. సొంత ఇల్లు నిర్మించుకునేందుకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఆర్థిక సాయం చేయాలని మంత్రికి విన్నవించారు. సామాన్యుల ఇళ్ల నిర్మాణం కోసం సుమారు రెండు లక్షల దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగ్​లో ఉన్నాయని కిషన్​రెడ్డి తెలిపారు. త్వరలో వీటిపై చర్చించి, బ్యాంకర్ల​తోనూ సమావేశం నిర్వహిస్తామన్నారు.

హైదరాబాద్​లో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటిస్తోందని.. వారితో సమావేశాలు నిర్వహించి పరిహారం అంచనా వేస్తున్నామన్నారు. బాధితులను ఆదుకోవడంలో యువత, స్వచ్ఛంద సంస్థలు ముందుకురావాలని కిషన్​రెడ్డి కోరారు.

ఇవీచూడండి: నష్టానికి సంబంధించి సమగ్ర నివేదిక అందలేదు: కేంద్రబృందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.