ETV Bharat / city

crop storage problems: గోదాముల్లో 95 శాతం పాత పంటే.. కొత్త పంట నిల్వకు చోటేది? - monsoon crop storage problems

రాష్ట్రంలో వానాకాలంలో కోటిన్నర టన్నులకుపైగా పంటలు మార్కెట్లకు రానుండగా వాటి నిల్వకు మాత్రం చోటులేకుండా పోయింది. ఇప్పటికే రాష్ట్రంలోని గోదాములు 95 శాతం పాత పంటతో నిండిపోయాయి. అవి ఖాళీ అయితేగానీ.. కొత్త పంట నిల్వకు అవకాశం లేదు. వానాకాలంలో తాము ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

crop storage problems
crop storage problems
author img

By

Published : Nov 13, 2021, 7:55 AM IST

రాష్ట్రంలో పంటల నిల్వకు గోదాముల(Shortage of go downs for crop storage) కొరత తీవ్రంగా ఉంది. ఈ వానాకాలంలో కోటిన్నర టన్నులకు పైగా పంటలు మార్కెట్లకు రానుండగా వాటి నిల్వ(monsoon crop storage)కు చోటులేకుండా పోయింది. రాష్ట్రంలోని 65.04 లక్షల టన్నుల సామర్థ్యమున్న గోదాముల్లో ప్రస్తుతం 95 శాతం స్థలం పాత నిల్వలతో నిండిపోయింది. అవి ఖాళీ అయితే తప్ప కొత్త పంటలు నిల్వచేసే అవకాశం లేదు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు సొంతంగా 2.93 లక్షల టన్నుల గోదాములుంటే అందులో ఇప్పుడు 30 వేల టన్నుల నిల్వకే అవకాశం ఉంది. మార్కెటింగ్‌ శాఖ(Telangana marketing department)కు 24.73 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యమున్న గోదాములుంటే వాటిలో 8 లక్షల టన్నుల గోదాములను గిడ్డంగుల సంస్థ ఇతరులకు అద్దెకిచ్చే విధానంలో నిర్వహిస్తోంది. వీటిలోనూ పెద్దగా ఖాళీ లేదు.

పత్తి... కదలిక కొంతే :

భారత పత్తి సంస్థ (సీసీఐ(Cotton corporation of India)) 2018-19, 2019-20లో కొన్న పత్తి ఇప్పటికీ గోదాముల్లో ఉంది. ఈ సంస్థ రైతుల నుంచి కొన్న సరకులో అమ్మకుండా ఉన్నది కొంతయితే, అమ్మేసినా వ్యాపారులు తీసుకెళ్లక గోదాముల్లోనే ఉన్నది 3 లక్షల బేళ్లకు పైమాటే. కొనుగోలు చేసిన పత్తిని(cotton crop purchase) వాహనాల్లో తీసుకెళ్లడానికి వ్యాపారులకు 3 నెలల దాకా సమయం ఇస్తున్నారు. కొందరు మాత్రం అంతకన్నా ఎక్కువ కాలం గోదాముల్లోనే ఉంచుతున్నారు. దీనివల్ల కొత్త పంటలు ఉంచేందుకు సమస్యలు వస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో పత్తికి గిరాకీ పెరగడంతో తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల వ్యాపారులు తెలంగాణకు వచ్చి పంటను కొంటున్నారు. వారు కొన్న పత్తి పంటను మిల్లుల్లో జిన్నింగ్‌(zinning mills in telangana) చేయించి వెంటనే వారి రాష్ట్రాల్లోని స్పిన్నింగ్‌ మిల్లులకు తరలిస్తున్నారు. ఒకవేళ పత్తికి ధరల్లేకపోతే సీసీఐ మద్దతు ధరకు కొని ఇక్కడే గోదాముల్లో నిల్వ చేసేది. అప్పుడు స్థలం సమస్య మరింత తీవ్రమయ్యేదని రాష్ట్ర జిన్నింగ్‌ మిల్లుల సంస్థ ప్రధాన కార్యదర్శి కె.రమేశ్‌ చెప్పారు.

వరి...రోడ్లపైనే పడిగాపులు

వరి ధాన్యాన్ని మద్దతు ధర(support price for paddy)కు కొనాలంటే అందులో తేమ తక్కువగా ఉండాలని ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. దీంతో రైతులు రోడ్లపైనే పగలంతా ధాన్యం ఆరబోసి రాత్రివేళకు మళ్లీ కుప్పలుగా చేస్తూ అక్కడే పడిగాపులు పడుతున్నారు. ఈ సీజన్‌లో 61 లక్షల ఎకరాల్లో వరి పంట సాగయినందున 1.40 కోట్ల టన్నుల వరిధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. ఇంత పంట వస్తే నిల్వ చేయడానికి గోదాములు లేవు. ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్ల ఆవరణల్లో ధాన్యం ఆరబోసుకోవడానికి సిమెంటు, కాంక్రీట్‌ చేసిన స్థలాలు లేక తారు రోడ్లపైనే ఆరబోస్తున్నట్లు మెదక్‌ జిల్లాకు చెందిన రైతులు రాజు, సత్యనారాయణ, రాజయ్య తదితరులు చెప్పారు. మొక్కజొన్న 15 లక్షల టన్నులు, పత్తి 40 లక్షల టన్నులు, కంది మరో 7 లక్షల టన్నుల దాకా దిగుబడి రావచ్చని అంచనా. ఇవన్నీ జనవరికల్లా మార్కెట్లకు వస్తాయని... అప్పటికల్లా గోదాములు ఖాళీ చేయకపోతే ఇబ్బందులు తప్పవని అధికారులు చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 20 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యమున్న గోదాములను మార్కెటింగ్‌ శాఖ నిర్మించింది. రాష్ట్రానికి మొత్తం కోటి టన్నుల సామర్థ్యమున్న గోదాముల అవసరమని అంచనా.. కాగా ప్రస్తుతం 65 లక్షల టన్నుల సరకు నిల్వకు గొడౌన్లున్నాయి. వాటిలో 26.50 లక్షల టన్నుల గోదాములు ప్రైవేటు యాజమాన్యాలవి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.